అమెరికా అధ్యక్ష ఎన్నికలే కీలకం

BSEFFF
BSE

అమెరికా అధ్యక్ష ఎన్నికలే కీలకం

ముంబై, నవంబరు 6: అమెరికా అధ్యక్షపదవికి జరు గుతున్న ఎన్నికల ఫలితాలే ఈ వారం దేశీయ మార్కెట్లకు మార్గదర్శిని అవుతాయని నిపుణుల అంచనా. డెమొక్రాట్‌ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌ గెలు పొందితే ప్రపంచ మార్కెట్లపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అంచనాలున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్‌ట్రంప్‌ ఎన్నికైతే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో సెంటిమెంట్‌ బలహీనపడ తుందన్న అంచనాలున్నాయి. ఉన్నట్లుండి ట్రంప్‌ ఆధిక్యంలోనికి రావడంతో గతవారం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పతనం అయిన అంశాలను ఇన్వెస్టర్లు ఉదహరిస్తు న్నారు. ఆర్ధ్థిక గణాంకాలు, సంస్థాగత ఇన్వె స్టర్ల పెట్టుబడులు ముడిచమురుధరలు, డాలర్‌రూపాయిమారకం విలువలు వంటివి కూడా కీలకం అవుతాయి. దేశీయంగా ఇప్ప టికే పలు కంపెనీలుఈ ఆర్థికసంవత్సరం ద్వితీయ త్రైమాసిక ఆర్థికఫలితాలు ప్రకటిం చాయి. మరికొన్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ప్రైవేటురంగ దిగ్గజంఐసిఐసిఐబ్యాంకు రెండో త్రైమాసిక ఫలితాలు వస్తాయి. మంగళవారం బిహెచ్‌ఇఎల్‌ బుధవారం లూపిన్‌, బాష్‌, శుక్ర వారం ఎంఅండ్‌ఎం ఫలితాలు వెల్లడి అవుతాయి. వీటితోపాటు సెప్టెంబరు పారిశ్రామికోత్పత్తి సూచి గణాంకాలు విడుదలవుతాయి. ఈ సూచి ఆగస్టులో 0.7శాతం నీరసించినసంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షపదవికి ఎన్నికలుమంగళవారం జరగనుండగా బుధవారం ఫలితాలు వెలువడనున్నాయి. హిల్లరీ క్లింటన్‌ ఎన్నికైతే మార్కెట్లపై పెద్దగా ప్రభావం ఉండదన్న దేశీయ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థలు అంచనాలున్నాయి.

ట్రంప్‌ అధ్యక్షుడైతే అమెరికా ఆర్థిక విధానాలు, రాజీకయ సామాజిక నిర్ణయాలు ఎలా ఉండవచ్చన్న అంశంపై పలు సందేహాలకు తెరలేస్తుందని ఆర్ధికవేత్తలు పేర్కొంటున్నారు. ఇక గతవారం అంతా ముడి చమురుధరలు డీలాపడ్డాయి. అదేబాటలో చమురు ఫ్యూచర్స్‌ కూడా నడుస్తున్నాయి. లండన్‌ మార్కెట్లో బ్రెట్‌ చమురు బ్యారెల్‌ ఒక్కింటికి 45.58 డాలర్లకు చేరితే న్యూయార్క్‌ మార్కెట్‌లోనైమెక్స్‌ కూడా బ్యారల్‌కు 44.07డాలర్ల వద్ద నిలిచింది. వారం మొత్తంగా దాదాపు 9శాతం పతనం అయి నట్లు నిపుణుల అంచనా. సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య వ్యతిరేకపరిస్థితులు తలెత్త డంతో చమురు సరఫరాల నియంత్రణ అంశంపై అనిశ్చితి ఏర్పడుతుందని అంచ నా. చమురు నిల్వలు పుంజుకుంటున్న కారణంగా డిమాండ్‌ తగ్గుతూవస్తోంది. గత వారం అంతా చమురు క్షీణించిన దిశగానే నడి చింది. ఇక వచ్చేవారం కూడా ఈ మార్కెట్‌ తీరు తెన్నులు కొంత కీలకం అవుతాయని అంచనా.