అమెరికాలో 67వేలు దాటిన కరోనా మరణాలు

24గంటలలో 1,435 మంది మృతి

corona patient dead body
corona patient

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ కుదిపేస్తుంది. ఇక్కడ కరోనా భారిన పడిన వారి సంఖ్య 12 లక్షలకు చేరవయ్యింది. అమెరికాలో గడచిన 24 గంటలలో కరోనా కారణంగా 1,435 మంది మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య ఏకంగా 67 వేలు దాటింది. అమెరికాలో కరోనా ప్రభావం రోజురోజుకు మరింత తీవ్రరూపం దాల్చుతుంది. ప్రపంచ దేశాలలో అత్యధిక కరోనా మరణాలు, అత్యధిక కరోనా కేసులు నమోదు అయిన దేశంగా ఇప్పటికే అమెరికా అవతరించింది. అయినప్పటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం లాక్‌డౌన్‌ ఎత్తేయడానికి మార్గదర్శకాలు విడుదల చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/