అమెరికాలో విస్త‌రిస్తున్న కార్చిచ్చు, భ‌యం గుప్పిట్లో జ‌నం!

Fire
Fire

అమెరికా: దక్షిణ కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకు విస్తరింస్తుంది. దీంతో వేలాది మంది సొంత ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. శాంటాపౌలాలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. గంటకు 65 నుంచి 90 కి.మీ వేగంతో వీస్తున్న గాలులు ఇందుకు తోడవగా కార్చిచ్చు కొద్దిగంటల్లోనే 25 చదరపు కి.మీ అటవీని దహించివేసింది. అగ్నిమాపక సిబ్బంది ఎంతగా శ్రమిస్తున్నా అదుపులోకి రాని మంటలు లక్షకుపైగా జనాభా ఉన్న శాంటాపౌలా నగరానికి ముప్పుగా పరిణమించాయి. ముందు జాగ్రత్తగా వేలమంది ఇతర ప్రదేశాలకు తరలివెళ్లారు. మిగిలిన వారు భయం గుప్పిట విద్యుత్‌ సరఫరా లేని పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు.