అమెరికాలో రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి
accident-in-california
కాలిఫోర్నియా : అమెరికాలోని దక్షణ కాలిఫోర్నియా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికో సరిహద్దులోని స్టేట్ రూట్ 115, ఇంపీరియల్ కౌంటీలోని నోరిష్ రోడ్లో ఉదయం 6.15 గంటల ప్రాంతంలో యూఎస్వీ కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 14 మంది మృత్యువాతపడగా.. హాస్పిటల్కు తరలించగా ఒకరు మృతి చెందారు. మరో పది మందికిపైగా గాయపడగా హాస్పిటల్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఎనిమిది మంది కూర్చోవాల్సిన వాహనంలో సుమారు 27 మంది వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుల్లో పది మంది మెక్సికన్ పౌరులు ఉన్నారని, మరో ముగ్గురి జాతీయత తెలియలేదని పేర్కొన్నారు.
కాగా, బాధితులంతా 15 నుంచి 53 ఏళ్ల వయసున్న స్త్రీ, పురుషులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు జాతీయ రవాణా భద్రతా బోర్డు తెలిపింది. ప్రమాదంలో మెక్సికన్లు మృతి చెందడంపై అక్కడి ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/national/