అమెరికాలో భారీ భూకంపం : రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత

గ్వాటెమాలా : గ్వాటెమా సిటీలో భూకంపం సంభవించింది. సెంట్రల్ అమెరికాలో భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీకి వివరాలను వెల్లడించింది. గ్వాటెమాల సిటీకి 78 కి.మీ దూరంలో, 110 కి.మీల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టుగా తెలిపింది. అయితే.. ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై తదుపరి సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/