అమెరికాలో నీర‌వ్ ఆస్తుల వేలం

neerav
neerav

న్యూయార్క్ః పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో కీలక పాత్రధారి, నగల వ్యాపారి నీరవ్ మోదీకి అమెరికన్ కోర్టు షాకిచ్చింది. అమెరికాలో మోదీకి సంబంధించిన ఆస్తుల వేలానికి పచ్చ జెండా ఊపింది. వివరాల్లోకి వెళితే.. హెచ్ఎస్‌బీసీ యూఎస్ఏ, న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఇజ్రాయిల్ డిస్కౌంట్ బ్యాంకులకు రూ.130కోట్లు ఎగవేసిన కేసులో ఈ తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశానుసారం ఏప్రిల్ 24న వేలం జరగనుంది.
ఫిబ్రవరి 26న న్యూయార్క్ కోర్టులో నీరవ్ మోదీ కంపెనీపై ఆ రెండు బ్యాంకులు పిటిషన్ దాఖలు చేశాయి. వాటిపై విచారణ చేపట్టిన కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. పీఎన్‌బీ కూడా నీరవ్ మోదీ వ్యవహారంపై న్యూయార్క్ కోర్టులో పిటీషన్ దాఖలు చేయనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.