అమెరికాలో తెలంగాణకు చెందిన వ్యక్తి దారుణ హత్య

nri sunil edla
nri sunil edla

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మెదక్‌కు చెందిన సునీల్‌ ఎడ్లా వెంట్నార్‌ సిటిలో నివసిస్తున్నారు. అయితే ఆయన తన ఉద్యోగాన్ని ముగించుకొని ఇంటికి వచ్చన సునీల్‌పై ఓ 16 ఏళ్ల బాలుడు కాల్పులు జరిపాడు.సదరు బాలుడు కాపుగాసి ఆయన రాగానే కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులు జరిపిన తరువాత సునీల్‌ కారును తీసుకొని నిందితుడైన బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆయన తన తల్లి 95వ జన్మదిన వేడుకల కోసం భారత్‌ వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇలా జరగడం దారుణమని సునీల్‌ బంధువులు  తెలిపారు.