అమెరికాలో కాల్పులు: స్టీవ్‌స్కేలైస్‌కు గాయాలు

Shooting incident
Shooting incident

అమెరికాలో కాల్పులు: స్టీవ్‌స్కేలైస్‌కు గాయాలు

వర్జీనియా: అమెరికాలోని వర్జీనియాలో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.. ఈ కాల్పుల్లో అమెరికాకు చెందిన సీనియర్‌ చట్టసభ్యుడు స్టీవ్‌స్కేలైస్‌కు తీవ్రగాయాలయ్యాయి.. ఎంపిల వార్షిక క్రీడ కోసం బేస్‌బాల్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు.. స్టీవ్‌ వీపు కింద బుల్లెట్‌ గాయాలతో లేవలేనిస్థితిలో ఉన్న ఆయన కాల్పుల నుంచి తప్పించుకునేందకు తన శరీరాన్ని ఈడ్యుకుంటూ కొంత దూరం వెళ్లినట్టు తెలుస్తోంది.. అగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.