అమెరికాను జిడిపిలో మించిపోతున్న ఆసియా దేశాలు!

ASIA
ASIA

ఆసియాలో ప్రధాన పది దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కలిపి అమెరికా జీడీపీని దాటే అవకాశం 2030 నాటికి ఏర్పడవచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డీబీఎస్‌ అంచనా వేసింది. ఈ పది దేశాల్లో భారత్‌తో పాటు చైనా, హాంకాంగ్‌, ఇండోనేషియా, ఫిలిఫ్పైన్స్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, తైవాన్‌, థాయ్‌లాండ్‌లు ఉన్నాయి. 2030 నాటికి ఈ పది దేశాల వాస్తవిక జీడీపీ (2010 స్థిర డాలరు ప్రాతిపదికన) సంయుక్తంగా 28.35 ట్రిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1,900 లక్షల కోట్లు)గా నమోదయ్యే అవకాశం ఉందని డీబీఎస్‌ పేర్కొంది. ఈ సమయానికి అమెరికా వాస్తవిక జీడీపీ 23.33 ట్రి.డాలర్లు మాత్రమే ఉండొచ్చని అంచనా వేసింది. వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న అసమానతలు, వాణిజ్య వాతావరణం హీన స్థితికి చేరడం, సాంకేతిక అంతరాయాలు తదితర ఆసియా దేశాల వృద్ధిని అడ్డుకొనే అవకాశం ఉందని వివరించింది.