అమెరికన్ నటుడితో రొమాన్స్
అమెరికన్ నటుడితో రొమాన్స్
నటుడు కమల్‌హాసన్ లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెలుగు, తమిళ , హిందీ భాషల్లో ‘శభాష్ నాయుడు సినిమాను ప్రఖ్యాత మలయాళ దర్శకుడు టికె. రాజీవ్కుమార దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో కమల్‌హాసన్ కూతురుగా శృతిహాసన్ కలిసి నటించనున్న సంగతి కూడ విదితమే.. తాజా సమాచారం ప్రకారం ఈచిత్రంలో శృతిహాసన్ సరసన అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్, అమెరికన్ నటుడు మను నారాయణ్ నటించనున్నారట.. మను నారాయణ్ గతంలో ఎఆర్ రెహమాన్ ‘బాంబే డ్రీమ్స్, ‘లవ్ గురు, ‘వాట్ స్ట్రీట్ – మనీ నెవర్ స్లీప్ చిత్రాల్లో నటించారు.. ఈసినిమాలో రమ్యకృష్ణ కమల్‌కు జోడీగా నటిస్తోంది.. షూటింగ్ ఎక్కువభాగం లాస్ఏంజల్స్లోనే చేయబోతున్నారట.