అమెజాన్ పై కఠిన చర్యలు : ట్రంప్

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రభుత్వానికి సరిగా పన్నులు చెల్లించడం లేదని ఆ దేశ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. అమెజాన్‌పై కఠిన చర్యలకు శ్వేత సౌధం సిద్ధమౌతుందన్న వార్తల మధ్య ట్విట్టర్ ద్వారా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమెజాన్ సంస్థ రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు పన్ను పూర్తిగా ఎగవేస్తుందని లేదా నామమాత్రపు పన్ను చెల్లిస్తుందని అన్నారు. ఆన్లైన్ ద్వారా కొన్న వస్తువులను వినియోగదారులకు చేర్చేందుకు అమెరికా తపాలా వ్యవస్థను ఉపయోగించుకుంటూ ఖజానాకు నష్టం చేకూర్చుతుందని దుయ్యబట్టారు.