అమెజాన్‌ యోధులు టీజర్‌ విడుదల

_MG_
ప్రముఖ హాలీవుడ్‌ నటుడు రిచాజెన్‌, సెనేలియా చియాంగ్‌ జంటగా ఇండో ఓవర్సిటీస్‌ బ్యానర్‌పై ఫ్రాంకీఛాన్‌ దర్శకత్వంలో 500 కోట్ల భారీ బడ్జెట్‌తో, హైటెక్నికల్‌ వాల్యూ స్‌తో జాకీచాన్‌ నిర్మించిన చిత్రం. ది లెజండరీ అమెజాన్స్‌..హాలీవుడ్‌లో సరికొత రికార్డులు క్రియేట్‌ చేసి భారీ వసూళ్లను రాబట్టిన ఈచిత్రాన్ని సాయి శ్రీజు విఘ్నేష్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై జి.వంశీకృష్ణ వర్మ అమెజాన్‌ యోధలు పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.. మహిష్కమతి రాజ్యం ఉపశీర్షిక.. ఈచిత్రం టీజర్‌ రిలీజ్‌ కార్యక్రమం జూన్‌2న హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఘనంగాజరిగింది. ప్రముఖ నిర్మాతలు డిఎస్‌రావు, ప్రతాని రామకృష్ణ గౌడ్‌, టి.రామసత్యనారాయణ, బాలాజీ నాగలింగం, నిర్మాత జి,వంశీకృష్ణ వర్మ, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు. అమెజాన్‌ యోథుడు ట్రైలర్‌ను డిఎస్‌రావు విడుదల చేయగా, ఫొటోకార్డ్స్‌పోస్టర్స్‌ను రామకృష్ణగౌడ్‌ రిలీజ్‌ చేశారు. డిఎస్‌రావు మాట్లాడుతూ,  అమెజాన్‌ యోథుడు ట్రైలర్‌ చాలా అద్భుతంగా ఉందన్నారు.. యాక్షన్‌ ఫిలింస్‌ తెలుగులోఎపుడూ ఫెయిల్‌ కాలేదని, ఈచిత్రం తప్పకుండా సక్సెస్‌ అవుతుందన్నారు. కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడారు.

నిర్మాత జి.వంశీకృష్ణవర్మ మాట్లాడుతూ, మా బ్యానర్‌లో రిలీజ్‌ అవుతున్న ఫస్ట్‌చిత్రంమిదని, ఇది తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా ఈచిత్రం నచ్చుతుందనే నమ్మంకతో రిలీజ్‌ చేస్తున్నామన్నారు. డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలలోనే సినిమాను రిలీజ్‌ చేస్తామన్నారు.