అమీబియాసిస్‌ నుండి విముక్తి ఎలా..?

Pain
Pain

అమీబియాసిస్‌ నుండి విముక్తి ఎలా..?

ఈ రోజుల్లో చాలామందిని పట్టి పీడిస్తున్న అతి సాధారణ వ్యాధుల్లో అమీబియాసిస్‌ ఒకటి. ఈ సమస్య నీటి కాలుష్యం కలుషిత ఆహారం, సరిగా ఉడకని ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఏర్పడుతుంది అమీబియాసిస్‌ సమస్య ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ బయట ఆహారం తరచుగా తీసుకునే వారిలో అధికంగా ఉంటుంది. ఈ సమస్యతో బాధ పడేవారు మల విసర్జనకు ఎక్కువసార్లు వెళ్లాలనుకుంటారు. ఎన్నిసార్లు మలవిసర్జనకు వెళ్లినా కూడా మరల వచ్చినట్లుగా ఉంటుంది.

ఇంతగా వేధించే అమీబియాసిస్‌కు హోమియోవైద్యంలో మంచి చికిత్స కలదు. సమస్యను తొలి దశలోనే గుర్తించి డాక్టర్‌ సలహామేరకు చికిత్స తీసు కుంటే సమస్య త్వరగా నయమవ్ఞతుంది. అమీబియాసిస్‌ ప్రధానంగా రెండు రకాలు 1. అమీబిక్‌ డీసెంట్రీ 2. బాసిల్లరి డీసెంట్రీ ఇందులో అందరిని ఎక్కువగా బాధించేది అమీబిక్‌ డీసెంట్రీ. కారణాలు: ఎంటామిబా హిస్టాలిటికా అనే పరాన్నజీవి, కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం.లక్షణాలు: -మలవిసర్జన తరచుగా వెళ్లవలసి వస్తుంది.-కడుపు నొప్పి స్వల్పంగా గాని, మెలిపెట్టినట్టుగా గాని ఉంటుంది. -మలవిసర్జన జిగురుగా నీళ్ల లాగా దుర్వాసనతో కూడి ఉంటుంది.

-కొన్ని సందర్భాలల్లో మలవిసర్జనలో రక్తం పడుతూ ఉంటుంది. -తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. -అరుదుగా జాతులు, బంక విరోచనాలతో పాటుగా, జ్వరం కూడా వచ్చిను. -బరువు కోలోపవడం, నీరసంగా ఉండటం. -జీవన విధానం సక్రమంగా జరుగక ఆందోళన, మానసిక ఒత్తిడి పెరుగును.

జాగ్రత్తలు:

కలుషిత ఆహారం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, ఆయిల్‌ఫుడ్స్‌, మసాలాలు, వేపుళ్లు, ఆల్కహాలు మానివేయాలి. -బయట చిరుతిడ్లు, నిలువ ఉంచిన పచ్చళ్లు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. – కలుషితం లేని నీరు సరిపడినంతగా తాగాలి. టీ, కాఫీలు మానివేయాలి. -మానసిక ఒత్తిడిని నివారించడానికి యోగా, మెడిటేషన్‌ వంటివి చేయాలి.

చికిత్స:

హోమియో వైద్యంలో అమీబియాసిస్‌తో బాధపడేవారికి మంచి చికిత్స కలదు. శారీరక, మానసిక లక్షణాలు ఆధారంగా మందులను ఎంపిక చేసుకొని ఇవ్వడం వల్ల వ్యాధి సమూలంగా నివారణ అవుతుంది. మందులు: బంక విరోచనాలతో పాటుగా, కొన్ని సందర్భాలల్లో మల విసర్జనలో రక్తం పడుతూ ఉంటుంది. ఆసనంలో నొప్పి కూడా ఉం టుంది. కాళ్లు, చేతులు చల్లగా ఉంటాయి. ఇటువంటి లక్షణాలున్న వారకి ఈ మందు ఆలోచించదగినది. కోల్‌సింత్‌: తరచుగా మలవిసర్జన జిగురుగా నీళ్లలాగా వెళ్లవలసి వస్తుంది. కడుపు నొప్పి స్వల్పంగాగాని, మెలిపెట్టినట్టుగా గాని ఉం టుంది. పొట్టలో నొప్పితో రోగి ముడుచుకొని పడుకుంటాడు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.

అర్జెంటం నైట్రికం:

పొట్టలో నొప్పి ఉండి తేన్పులు ఎక్కువగా ఉంటాయి. తిన్న తర్వాత పొట్టలో నిప్పి ప్రారంభమవుతుంది. వీరు మానసిక స్థాయిలో ఆందోళన చెందుతుంటారు. ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినా ఎవరైనా వస్తు న్నారని తెలిసినా ఏదైనా పని తలపెట్టినా గందరగోళంలో పడిపోతారు. నక్స్‌వామికా: వీరు మలవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్లాలనుకుంటారు. ఎన్నిసార్లు మలవిసర్జనకు వెళ్లినా కూడ మరల వచ్చినట్లుగా ఉంటుంది. వీరు కొన్ని రోజులు విరేచనాలతో, కొన్నిరోజులు మలబద్దకంతో బాధ పడుతుంటారు. ఫాస్ట్‌పుడ్స్‌, కాఫీలు ఎక్కువగా సేవించడం, శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక శ్రమ ఎక్కువగా ఉన్నవారికి ఈ మందు ఆలోచించదగినది.

యాలోస్‌:

వీరికి పొట్టలో గ్యాస్‌ ఎక్కువగా ఉండి, విరేచనం ఆపుకోలే నంత గంగా వచ్చును. వీరు బాతురూముకి వెళ్లేంత లోపలోనే మల విసర్జన జరిగిపోతుంది. వీరికి మలవిసర్జన గ్యాస్‌తో పాటుగా నీల్లు నీల్లుగా అవ్ఞతుంది. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజ నకారి. ఈ మందులే కాకుండా మెర్కుసాల్‌, కాంథారిస్‌, కాల్చికం, ఇపికాక్‌, బ్రయోనియా, సల్ఫర్‌, కార్పొవైజ్‌, చైనా వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడితే అమీబియాసిస్‌ నుండి విముక్తి పొందవచ్చును.