అమాయ‌కుల‌పై దాడులు చేస్తే క‌ఠిన చర్య‌లు

Malakondaiah
Malakondaiah

అమ‌రావ‌తిః దొంగల పేరుతో అమాయకులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకంటామని డీజీపీ మాలకొండయ్య పేర్కొన్నారు. గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు. అలాగే వదంతులను సృష్టిస్తున్న వారిపై కూడా చర్యలు తీసకుంటామని, ఇప్పటికే వదంతులను సృష్టిస్తున్న వారిని గుర్తించామన్నారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాలో కొందరిని పట్టుకున్నామని డీజీపీ అన్నారు.