అమరావతి నిర్మాణంపై దాఖలైన పిటిషన్ కొట్టివేత

SUPREME COURT
SUPREME COURT
న్యూఢిల్లీ: అమరావతి నిర్మాణంపై ఎన్జీటీ తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు సరైనవేనంటూ ట్రిబ్యునల్‌ తీర్పు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఈఏఎస్‌ శర్మ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన ధర్మాసనం ఇలాంటి పిటిషన్లను అనుమతించడం సరికాదని పేర్కొంది. దురదృష్టవశాత్తు ఇలాంటి పిటిషన్లు భారత్‌లోనే వస్తాయన్న జస్టిస్‌ ఏకే సిక్రి వ్యాఖ్యానించారు.