అభిషేక్‌ పిక్చర్స్‌ చిత్రం షూటింగ్‌ ప్రారంభం!!

Movie Starrt
Movie Starrt

అభిషేక్‌ పిక్చర్స్‌ చిత్రం షూటింగ్‌ ప్రారంభం!!

సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ శ్రీవాస్‌- ప్రామిసింగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ల కాంబినేషన్‌లో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇది శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న కావడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా రూపొందనున్న ఈ చిత్రలో జగపతిబాబు, రవికిషన్‌, మధు గురునటుడు ప్రతినాక పాత్రలు పోషించనున్నారు.ఓ ప్రముఖ బాలీవ్ఞడ్‌ క్‌థానాయికను బెల్లంకొండ సరసన చేయనున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిమ్‌ సిటీలో భారీ సెట్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీవాస్‌ మాట్లాడుతూ డిక్టేటర్‌ అనంతరం నా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రమిది. ఒక డిఫరెంట్‌ జోనర్‌ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా సరికొత్తగా ప్రెజంట్‌ చేయనున్నారు.

బడ్జెట్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నా. మ్యూజికల్‌ రాక్‌ స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీత సారధ్యం వహించనుండగా నేషనల్‌ పీటర్‌ హైన్స్‌ ఈ సినిమా కోసం డిఫరెంట్‌ ఫైట్స్‌ను డిజైన్‌ చేస్తునానరు. సక్సెస్‌ ఫుల్‌ రైటర్‌ సాయిమాధవ్‌ చిత్రానికి మాటలు రాయనున్నారు. నేటి నుండి రామోజీఫిలిమ్‌ సిటీలో రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభించాం. మేజర్‌ షెడ్యూల్‌ను ఫారిన్‌లో ప్లాన్‌ చేస్తున్నాం. ఓ బాలీవ్ఞడ్‌ హీరోయిన్‌ను బెల్లంకొండ శ్రీనివాస్‌ సరసన చేయనున్నాం అన్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా మాట్లాడుతూ శ్రీవాస్‌ చెప్పిన కథ నాకు బాగా నచ్చడం శ్రీనివాస్‌ హీరోగా ఒక సినిమా నిర్మించాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉండడం ఇప్పుడు ఈ ప్రోజెక్ట్‌ ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది. కథకి తగినట్లుగా ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా భారీ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. రామోజీ ఫిలిమ్‌ సిటీలో భారీ సెట్‌ను వేశాం. బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు శ్రీవాస్‌ కెరీర్‌ అత్యుత్తమ చిత్రంగా రూపొందనుంది అన్నారు.