అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరాం

mlc's
mlc’s

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు
హైదరాబాద్‌: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు తమ వంతు సహకారం అందించడానికే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీలు అకుల లలిత, సంతోష్‌కుమార్‌, దామోదర్‌రెడ్డి, ప్రభాకర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున తాము ఎన్నికైనప్పటికీ ప్రజలంతా కేసీఆర్‌ వైపు ఉన్నారని స్పష్టం చేశారు. సభలో తమ సీట్లను టీఆర్‌ఎస సభ్యులతో పాటే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ నుంచి ఎన్నికైన తమను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని మండలి చైర్మన్‌ స్వామిగైడ్‌కు లేఖ అందించని సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడాలన్న ఉద్దేశ్యంతోనే తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీతో పొత్తుతో కాంగ్రెస్‌ పార్టీ బాగా నష్టపోయిందని చెప్పారు. ఎన్నికలలో భాగంగా టీడీపీతో పొత్తు పెట్టుకునే అంశంపై గానీ మరే ఇతర అంశంపై గానీ ఎమ్మెల్సీలుగా కనీసం మాట మాత్రంగానైనా తమకు పార్టీ అధిష్టానం చెప్పలేదని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.