అభివృద్ధికి అద్ధంలా తండాలు

TS CMKCR
TS CMKCR

అభివృద్ధికి అద్ధంలా తండాలు

హైదరాబాద్‌:గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ కీలక నిర్ణయం టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ప్రగతి భవన్‌కు వచ్చిన గిరిజన తండావాసులను ఉద్దేశించి సిఎం ప్రసంగించారు. గిరిజనులకు ప్రత్యేకమైన జీవనశైలి, భాష ఉందన్నారు. ఆయా వర్గాల మధ్య వేషధారణ, వివాహాలు,పండుగలు,దేవతారాధన ఇల్లా అన్నింటిలోనూ తేడా ఉందన్నారు. ‘విశాల భారత దేశంలో ఉన్న అనేక జాతులు తమ సంప్రదాయ సంస్కృతులను, జీవన శైలి కాపాడుకుంటాయి. సమాజం నవీనతవైపు వెళ్తున్నా పాతవాటిని ఏ సమాజమూ కోల్పోదు. తండాలను అద్దాల్లా తీర్చిదిద్దాలి. తెలంగాణ రాష్ట్రంలోని ఇంచుమించు 3వేల గిరిజన గ్రామాలు పంచాయతీలుగా ఉండే అవకాశం ఉంది. ఇది ఉమ్మడి ఏపిలోనూ లేదు. ప్రభుత్వం నుంచి నేరుగా,కేంద్రం నుంచి కూడా ఏడాదికి కనీసం రూ.20 లక్షలు వస్తాయి. నేరుగా తండాకు వచ్చే ఈ డబ్బుతో అద్దాల్లాగా తీర్చిదిద్దే బాధ్యతను పెద్దలు తీసుకోవాలి. ఇవన్నీ సాధించుకున్న నాడే ఈ బిల్లుకు సార్థకత చేకూరుతుంది అని చెప్పారు. బంగ్లాదేశ్‌లో యూనస్‌ అనే ప్రొఫెసర్‌ పేదరికం పోయేందుకు చేసిన కృషిని వివరించారు.