అభిమానుల కోసం యాప్‌ను లాంచ్‌ చేసిన సింధు

PV SINDHU
PV SINDHU

హైద‌రాబాద్ః భారత బ్యాడ్మింటన్ సంచలనం.. రియో ఒలింపిక్ రజత పతాక విజేత పీవీ సింధు తన అభిమానులకు ఓ అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఇప్పటికే 2017 సంవత్సరాన్ని దిగ్విజయంగా ముగించి, ప్రపంచ నెం.3 స్థానంలో స్థిరపడ్డ సింధు.. 2018లో తన టార్గెట్ ప్రపంచ నెం.1 స్థానాన్ని కైవసం చేసుకోవడమే అని పేర్కొంది. బుధవారం సింధు తన పేరిట ఓ యాప్‌ని లాంచ్ చేసింది. ఈ సందర్భంగా తన యాప్‌ని ఇంస్టాల్ చేసుకొని అందులో ఓ ప్రత్యేక పోటీలో పాల్గొంటే తనతో నేరుగా ఆడే ఛాన్స్ కొట్టేయొచ్చని సింధు పేర్కొంది. ‘‘నాలాగే మీలో చాలా మందికి బ్యాడ్మింటన్ అంటే ఇష్టం, నా యాప్‌లో ఉన్న ప్రత్యేక పోటీలో నాతో కలిసి ఆడేందుకు మీకో అవకాశం పొందడి.’’ అని సింధు ట్వీట్ చేసింది.