అభిమానులు ఫిదా..

PC
PC

అభిమానులు ఫిదా..

మోడల్‌గా జీవితాన్ని మొదలుపెట్టిన కొన్ని రోజులక 2001వ సంవత్సరంలోనే మిస్‌ ఇండియాగా , మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్న బ్యూటీ ప్రియాంక చోప్రా.. ఇక మరి కొన్ని రోజులకే బాలీవుడ్‌ వెండితెరపై తనదైన శైలిలో సినిమాలు చేసి నేషనల్‌ అవార్డులతో పాటు కొన్ని పురస్కారాలను కూడ అందుకుంది.. ముఖ్యంగా ఆమె నటించిన ఫ్యాషన్‌ సినిమా చాల పేరు తెచ్చిపెట్టింది..
ఇక ఆమె పడిన కష్టానికి ఫలితంగా బాలీవుడ్‌లో స్టార్‌హీరోయిన్‌గా మారిపోయింది..అంతేకాకుండా తన అందాలతో హాలీవుడ్‌ని ఆకర్షించి అక్కడ కూడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.. ఎక్కువగా బుల్లితెరపై అక్కడ టార్గెట్‌ పెట్టింది.. అయితే ప్రియాంక అప్పుడపుడు కొన్ని ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్‌లలో కూడ తన అందాలను ప్రదర్శిసోతంది.. రీసెంట్‌గా ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి కూడ ప్రియాంక ఇచ్చిన ఫొటో షూట్‌ అందరినీ అకట్టుకుంటోంది.. ఇంతకుముందు బికినీ అందాలు ఎన్ని ఆరబోసిన ఇపుడు అమ్మడు ఇచ్చిన స్టిల్స్‌ చూస్తుంటే అభిమానుల మతిపోతోంది.. ప్రియాంక ఫోజులకు ఫిదా అయిపోతున్నారు.. తాజాగా ఆమె రెండు హాలీవుడ్‌ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉంది.. ఇదిలా ఉంటే మనదేశ వ్యామగామి రాకేశ్‌శర్మ జీవితంపై అమీరఖాన్‌ హీరోగా తీయన్ను సినిమాలో ఆమె రాకేశ్‌ భార్యగా నటిస్తోంది..