అభిమానులకు శ్రీముఖి విజ్ఞప్తి

తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని సూచన

srimukhi
srimukhi

హైదరాబాద్‌: టెలివిజన్ వ్యాఖ్యాతర శ్రీముఖి బిగ్ బాస్ మూడో సీజన్ లో రన్నరప్ గా నిలిచి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. ఈనేపథ్యంలోనే ఆమెకు పేరుప్రఖ్యాతులు కొన్ని సందర్భాల్లో అసహనానికి గురిచేస్తున్నాయి. కొందరు అభిమానులమంటూ నేరుగా ఇంటికి వచ్చి ఫొటోలు దిగుతామంటూ ఇబ్బంది పెడుతున్నారని శ్రీముఖి అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తమకు తెలిసిన వాళ్ల ద్వారా నేను ఎక్కడ ఉంటున్నానో తెలుసుకుని అక్కడికి వచ్చేస్తున్నారు. ఇంటి ముందు గంటలు గంటలు పడిగాపులు కాస్తున్నారు. దేనికైనా ఓ సమయం, సందర్భం ఉండాలి కదా! మాకూ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి కదా! అదంతా వదిలేసి కొందరు వ్యక్తులు, ఫలానా ఊరి నుంచి వచ్చాం మీతో ఫొటో దిగాలి అంటున్నారు.

వాళ్లలో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలూ ఉన్నారు. మీరెవరో తెలియకుండా హఠాత్తుగా వచ్చి ఫొటోలు దిగాలంటే ఎలా? ముందుగా నా పీఏకి సమాచారం అందిస్తే నేను అందుకు సన్నద్ధమయ్యే అవకాశముంటుంది. ఓ టీవీ షో కోసం రాత్రంతా షూటింగ్ చేసి ఇంటికి వెళ్లాను. ఉదయాన్నే ఇంటి వద్ద కొందరు ఫొటో దిగుతాం అంటూ అడిగారు. ఇలాంటి అభిమానులు మా పరిస్థితి అర్థం చేసుకోవాలి. నా కోసం ఎవరూ ఊర్ల నుంచి రావొద్దు. ముందుగా సమాచారం ఇస్తే తగిన సమయం కేటాయించేందుకు ప్రయత్నిస్తాను అంటూ తన ఆవేదన వెలిబుచ్చారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ లో స్పందించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/