అభిమానులకు బర్త్‌డే కానుక

NAG1222
NAGARJUNA

అభిమానులకు బర్త్‌డే కానుక

అక్కినేని నాగార్జున తాజా చిత్రం రాజుగారి గది 2కు సంబంధించిన ప్రచార హడావుడి మొదలైపోయింది.. త్వరలోనే మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌ చేయబోతున్నట్టు కూడ ప్రకటించారు.. ఇందో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు నాడు రాజుగారి గది 2 ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌ చేయబోతున్నారు.. ఇంకో నెలన్నరలోనే ఈచిత్రం ప్రేమకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇక ప్రమోషన్‌ మొదలుపెట్టి
జనాల్లోకి సినిమాను తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని టీం భావిస్తోంది.
దీపావళి కానుకగా అక్టోబర్‌ 13న ఈచిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు.. డైరెక్టర్‌ ఓంకార్‌ దర్శకత్వంలో రూపొందతున్న ఈచిత్రంలో రాజుగారి గదిలో నటించని ఓంకార్‌ తమ్ముడు అశ్విన్‌కూడ ఓ కీలకపాత్ర చేస్తున్నాడు.. అదేవిధంగా సమంత, సీరత్‌కపూర్‌ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.. పివిపి సినిమాస్‌ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది.. నాగార్జున ఇందులో మోడర్న్‌ మాంత్రికుడి పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.. అయన గెటప్‌ కొత్తగా ఉంటుందని అంటున్నారు..