అభిబస్‌ యాప్‌తో ఆన్‌లైన్‌ టికెట్‌ రిజర్వేషన్‌

b3
MaheshBabu

అభిబస్‌ యాప్‌తో ఆన్‌లైన్‌ టికెట్‌ రిజర్వేషన్‌

హైదరాబాద్‌, అక్టోబరు 29: రవాణారంగంలో అన్ని కేటగిరీల్లో కస్టమర్లకు మరింత చేరువ అవుతున్న అభిబస్‌ కొత్తగా యాప్‌ను కూడా విడుదలచేసింది. అంతేకాకుండా కంపెనీ తన ప్రచారకర్తగా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబును నియమించుకుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతోడుగా అభిబస్‌ నినాదంతో విస్తృత ప్రచారం చేస్తోంది అభిబస్‌ సిఒఒబిజు మాథ్యూ స్‌ మాట్లాడుతూ బస్‌ టికెట్ల జారీలో దేశవ్యాప్తంగా అగ్ర గామిగా కొనసాగు తున్నామని, ప్రభు త్వరంగంలోని రవా ణా కార్పొరేషన్లేకాకుండా ప్రైవేటురంగ సంస్థల టికెట్లు కూడా కస్టమర్లకు చేరువ చేసినట్లు తెలి పారు. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో అభిబస్‌ యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకునే సదుపాయం ఉందన్నారు. సేవల్లో నాణ్యత, స్థిరత్వం, విశ్వాసం పెంపొందించే విధంగా అభిబస్‌ అన్ని వయసుల వారికి మరింతగా చేరువ కాగలదని మాథ్యూస్‌ ధీమా వ్యక్తం చేశారు.