అబ్బాయితో అమ్మాయి.. ఓ సరికొత్త ప్రేమకథ

 

 
అబ్బాయితో అమ్మాయి.. ఓ సరికొత్త ప్రేమకథ

నాగశౌర్య, పాలక్‌ లల్వాని నటీనటలుగా రమేష్‌వర్మ దర్శకత్వంలో రూపొందినచిత్రం అబ్బాయితో అమ్మాయి…జనవరి 1న తేదీన కొత్త సంవత్సరం రోజున విడుదల కానుంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం ఇప్పటికే మంచిరెస్సాన్స్‌ వచ్చింది. ఇక రవితేజ హీరోగా నటించిన ‘వీర సినిమా తర్వాత మళ్లీ ఇంతకాలానికి తన కొత్త సినిమాను సిద్ధం చేసిన రమేష్‌ వర్మ ఈ సినిమాకై చాలా నమ్మకంతో ఉన్నారు. అబ్బాయితో అమ్మాయి ఓ మంచి సినిమాగా ప్రేక్షకులను అలరిస్తుందన్ననమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..
వీర తర్వాత మళ్లీ ఇపుడు సినిమా చేస్తున్నారు.. కారణం మేంటి?
రవితేజ హీరోగా నా దర్శకత్వంలో వచ్చిన వీర అనుకోకుండా వచ్చిన ఆఫర్‌.. కొంత ఒత్తిడి మధ్య చేశాను. దాని తర్వాత ఓ ప్రేమకథ చేద్దామని అన్పించి ‘అబ్బాయితో అమ్మాయి మొదలుపెట్టా. నిజానికి నాగశౌర్య ఈ సినిమాతోనే పరిచయం కావాల్సిఉంది. అయితే కొత్త హీరోతో ఈస్థాయి బడ్జెట్‌ అంటే ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో ఇది రెండేళ్లు అక్కడే ఆగిపోయింది. ఈలోపున నాగశౌర్య కూడ ఇతర అవకాశాలతో బిజీ అయ్యాడు. మళ్లీ అన్నీకుదిరి నిర్మాతలు దొరికాక ఇపుడు సినిమా మొదలైంది.

మీ దర్శకత్వంలో పరిచయం కావాల్సిన హీరో నాగశౌర్యలో అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏం చూశారు?
నాగశౌర్యను నేనే పరిచయం చేయాల్సి వచ్చిన రోజుల్లో అతడు ఈసినిమాలోని ఎమోషన్‌ను పండించగలడా? అన్న అనుమానం ఎక్కడో ఓ చోట ఉండేది. అయితే అనుకోకుండా ఈ సినిమా ఆలస్యమవ్వటం, ఈలోపు రెండు మూడు వరుస సినిమాల్లో శౌర్య నటుడిగా నిరూపించుకోవటం ఈ సినిమాకు కలిసి వచ్చింది..

ఇళయరాజాతో మీ అసోసియేషన్‌ గురించి చెప్పండి?
ఇళయరాజాగారికి నేను చాలా క్లోజ్‌. ఆయనతో ఏ విషయమైనా మాట్లాడగలను. వీర తర్వాత వస్తా నీవెనుక… అని ఒక సినిమా అనుకున్నా.. ఆప్రాజెక్టు డిస్కషన్‌ అపుడే ఇళయరాజా గారికి అబ్బాయితో అమ్మాయి కథ విన్పించా… ఈకథ విన్నాక ఆయన ముందు ఇదే చే§్‌ు అన్నారు. ఆయన సలహాతోనే ఈసినిమాను స్టార్ట చేశా. ఆయన అందించిన మ్యూజిక్‌కు మంచి స్పందన వస్తోంది. సినిమా చూశాక చాలా బాగుంది. తమిళ్‌లో కూడ రిలీజ్‌ చేయి అన్నారు.. సి.,కళ్యాణ్‌గారు తమిల్‌లో ఈసినిమాను రిలీజ్‌ చేస్తున్నారు.

జనవరి 1న రెండు క్రేజ్‌ ఉన్న ఇతర సినిమాలతో కలిసివస్తున్నాయి. ఈకాంపిటీషన్‌ను ఎలా తీసుకుంటున్నారు..
అబ్బాయితో అమ్మాయి సినిమాపై మాకైతే మంచి నమ్మకం ఉంది. డిస్ట్రిబ్యూటర్లతో సమా చూసినవారంతా బాగుందన్నారు. సినిమా సక్సెస్‌పై మేమందరం కాన్ఫిడెంట్‌గానే ఉన్నాం. హాలిడే సీజన్‌ కూడ వస్తోంద.. కాబట్టి అన్ని సినిమాలూ బాగా ఆడాలనే కోరుకుంటున్నా…