అబ్దుల్లా సవాల్‌తో వెనక్కి తగ్గిన రాంమాధవ్‌

ram madhav
ram madhav

న్యూఢిల్లీ: కశ్మీర్‌ అసెంబ్లీ రద్దు అంశంపై ఎన్సి నేత ఒమర్‌ అబ్దుల్లా సవాల్‌ చేయడంతో బిజెపి నేత రాంమాధవ్‌ వెనిక్కి తగ్గారు. పాకిస్థాన్‌ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే పిడిపి, ఎన్సీ ఒక్కటయ్యారని ఇవాళ ఉదయం రామ్‌ మాధవ్‌ ఆరోపణలు చేశారు. దాన్ని ఒమర్‌ అబ్ధుల్లా సవాల్‌ చేశారు. దమ్ముంటే ఆ ఆరోపణలు రుజువు చే యాలని సవాల్‌ విసిరారు. బయటి ఒత్తిడి ఏదీ లేదని ఒమర్‌ సవాల్‌ చేయడంతో బిజెపి నేత రామ్‌ మాధవ్‌ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు. భవిష్యత్‌లో పిడిపి, ఎన్సీ పార్టీలు కలిసి పోటీ చేయాలని సూచించారు. తాను చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయమైనవని, అవి వ్యక్తిగతమైనవి కావన్నారు.