అబద్ధాల ప్రచారానికి కాంగ్రెస్‌కు విదేశీ ఏజెన్సీలు

Narendra Mody
Narendra Mody

న్యూఢిల్లీ: విదేశీ ఏజెన్సీలను నియమించుకుని కాంగ్రెస్‌ పార్టీ దేశంలో అవాస్తవాలనుప్రచారంచేస్తోందని ప్రధాన మంత్రి మోడీ కర్నాటక బిజెపి కార్యకర్తలకు ఉద్భోధించారు. అబద్దాలను వల్లెవేస్తూ కాంగ్రెస్‌ పార్టీ బిజెపి పట్ల ప్రజల్లో చులకనభావం తీసుకురావాలని చూస్తోందని ఎంతమాత్రం సాధ్యంకాదని అన్నారు. అంతేకాకుండా సమాజాన్ని కులప్రాతిపదికన విభజించి పాలించాలన్న కుట్రచేస్తోందన్నారు కాంగ్రెస్‌ సంస్కృతికి స్వస్తిచెపితేకానీ దేశంలో రాజకీయ స్వఛ్ఛత అనేది కనిపించదని ఆయన అన్నారు. కర్నాటక అసెంంబ్లీ ఎన్నికల నిమిత్తం బిజెపి అభ్యర్ధులు, రాష్ట్ర కార్యాలయ సభ్యులు, కర్నాటక నాయకులతో నరేంద్రమోడీ యాప్‌తో ప్రధాని ముచ్చటించారు. కాంగ్రెస్‌ భ్రమల్లో పడిపోవద్దని, ఆపార్టీ అబద్దాలను విశ్వసించవద్దని నేరుగాప్రజలకు చేరువ కావాలని ఓటింగ్‌ ప్రక్రియ ముగిసేంతవరకూ ఓటర్లకు బిజెపి సిద్ధాంతాలు వివరించాలనికోరారు. గడచినకొన్ని ఎన్నికలను విశ్లేషిస్తే కులమతాలపేరిట కొన్ని పార్టీలు సమాజాన్ని ఎలా విడదీశాయో తెలుస్తుందని అన్నారు. ఎన్నికలకు ముందు ఒక కులానికి లాలీపాప్‌లుఇస్తుందని, ఆ తర్వాత వాటిని విస్మరిస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పనితీరే ఈవిధానమని కొన్ని కులాల్లోనెలకొన్న అసహనాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్దిపొందాలని ప్రయత్నిస్తుందని, తీరా ఎన్నికలయ్యాక వాటిని విస్మరిస్తుందని అన్నారు. వారుచేసిన పనులను ఎప్పటికీ వివరించలేరని, కేవలం సమాజాన్ని విడదీసేందుకే పనిచేస్తారని అన్నారు. కాంగ్రెస్‌ సంస్కృతి ప్రధాన జనజీవనస్రవంతినుంచి నిర్మూలనజరిగితేనే ఈ విభజనకు తెరపడుతుందని అన్నారు. అనేకసార్లు ఎన్నికల్లో ఓటమి పాలయిన కాంగ్రెస్‌ పార్టీ కేవలం అబద్దాలనే నమ్ముకున్నదని విమర్శించారు. అంతకుముందు కాంగ్రెస్‌ పది అంశాలపై కాంగ్రెస్‌ అబద్దాలు ప్రచారంచేసిందని, ఇపుడు మొత్తం 50అంశాల్లో 40-45 వరకూ అబద్దాలే ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ సరిస్థితుల్లో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పటిష్టం కావాలని, కాంగ్రెస్‌ పార్టీ అవాస్తవాలప్రచారాన్ని ప్రజల్లోనిక తీసుకెళ్లాలని విదేశీఏజెన్సీలను నియమించుకుని అవాస్తవాలు వల్లెవేసినంతమాత్రాన బిజెపి మసకబారదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఇతర రాజకీయ పార్టీలు అభివృద్ధిపై మాట్లాడేందుకు వెనుకంజవేస్తాయని ఎందుకంటే అంతంతమాత్రంగానే అభివృద్ధి జరిగిందన్నారు. విభజనపైనే దృష్టికేంద్రీకరించే పార్టీలకు అభివృద్ధి నచ్చదని సుపరిపాలనతో తాము ఎన్నికల్లో పోటీచేస్తామని, కేవలం అభివృద్ధి నమూనాయే ప్రత్యేక అజెండాగా ఉంటుందని అన్నారు.