అబద్ధాల పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు

somu veerraju
somu veerraju

రాజమండ్రి: పెట్రోల్‌ ధరలపై సియం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై బిజెపి నేతలు మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్‌ రేటు రూ.100కు చేర్చుతారన్న సియం చంద్రబాబు వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మండిపడ్డారు. పెట్రోల్‌పై ఏ రాష్ట్రంలో లేని పన్నుల భారం ఏపిలో ఉందన్నారు. ఏపిలో పెట్రోల్‌ రేటును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అడ్డుకున్నారని ఆకుల సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు టిడిపికి కాకుండా అబద్ధాల పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని మరో ఎమ్మెల్యే సోము వీర్రాజు విమర్శించారు. మోదీపై వేసేందుకు పెట్రోల్‌ రేటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అమరావతి బాండ్లలో పెట్టుబడి పెట్టినవారిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అవినీతి సొమ్మును అమరావతి బాండ్లలోకి మళ్లిస్తున్నారని వీర్రాజు ఆరోపించారు.