అఫ్రిది కాశ్మీర్‌ సమస్యపై సంచలన వ్యాఖ్యలు

SHAHID AFRIDI
SHAHID AFRIDI

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఉన్న నాలుగు రాష్ట్రాలనే సరిగా పాలించలేకపోతున్నారు. ఇక పాకిస్థాన్‌కు కాశ్మీర్‌ ఎందుకు అని పాక్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాశ్మీర్‌ను వదిలి ఉన్న ప్రాంతాన్ని సరిగా చూసుకోండి అని పాక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాడు. బ్రిటిష్‌ పార్లమెంటులో విద్యార్ధులతో మాట్లాడుతూ..ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించలేని వారికి ఇంకొంత భూభాగం ఎందుకు అని విమర్శించాడు. ఇక కాశ్మీర్‌ ఇండియాకు కూడా ఇవ్వద్దని ,కాశ్మీర్‌ స్వతంత్ర దేశం కావాలని, అక్కడ ప్రజలు ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నానని అఫ్రిది అన్నాడు.