అఫ్రిదిపై గంబీర్‌ ఫైర్‌

gowtham
gowtham


ముంబయి: ఆర్టికల్‌ 370 రద్దుతో నిలువెల్లా రగిలిపోతున్న పాక్‌ సెలబ్రిటీలు తమదైన అక్కసును వెళ్లబుచ్చుతున్నారు. ఇందులో భాగంగా నియంత్రణ రేఖ (ఎల్‌ఒసి) వద్దకెళ్లి శాంతి పతాకం ఎగరేస్తానన్న పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదిపై టీమిండియా మాజీ క్రికెటర్‌, ఎంపి. గౌతమ్‌ గంభీర్‌ తనదైన విమర్శతో తిప్పికొట్టాడు. అతడికి వయసు, బుర్ర పెరగలేదని ఎద్దేవా చేశారు. కొందరు మనుషులకు తాము ఏం మాట్లాడుతున్నామో అర్ధం కాదని వ్యంగ్యంగా అన్నారు. ‘ప్రధాని పిలుపునిచ్చిన కాశ్మీర్‌ అవర్‌కు ఒక జాతిగా స్పందించండి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నేను మహ్మద్‌ అలీ జిన్నా సమాధి వద్ద ఉంటాను. మన కాశ్మీర్‌ సోదరులకు సంఘీభావం ప్రకటించేందుకు నాతో కలవండి. సెప్టెంబరు 6న నేను అమరవీరుల స్వస్థలం సందర్శిస్తాను. త్వరలోనే నియంత్రణ రేఖ వద్ద పర్యటిస్తాను అని అఫ్రిది బుధవారం ట్వీట్‌ చేశాడు అతడికి గౌతమ్‌ గంభీర్‌ ఘాటుగా బదులిచ్చాడు. ‘మిత్రులారా, సాహిద్‌ అఫ్రిది అవమానం పాలయ్యేందుకు తర్వాత ఏం చేయాలని షాహిద్‌ అఫ్రిదిని అడుగుతున్నాడు. ఎలాంటి సందేహం లేకుండా దీనివల్ల తెలిసిందేమిటంటే షాహిద్‌ అఫ్రిది పరిణతి పొందేందుకు నిరాకరించాడని! అతడికి సాయం చేసేందుకు ఆన్‌లైన్‌ కిండర్‌ గార్డెన్‌ పాఠాలు ఆర్డరిస్తున్నాను అని గౌతమ్‌ ట్వీట్‌ చేశాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/