అప్పుడే ప్లాన్‌ చేసేసింది!

HAN
Hansika

అప్పుడే ప్లాన్‌ చేసేసింది!

బబ్లీ గాళ్‌ హన్సిక అప్పుడే దీపావళి ఏర్పాట్లు చేసేసుకుంటోంది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా అమ్మడు గ్రాండ్‌ గా ప్లాన్‌ చేస్తోంది. దీని గురించి ఈ ముద్దుగుమ్మ చెబుతూ, మాకు దీపావళి చాలా ఇంపార్టెంట్‌. ఎక్కడున్నా ఆ సమయానికి ముంబ§్‌ు లోని ఇంటికి చేరిపోతాను. ఈ ఏడాది కూడా షూటింగుల నుంచి రెండు రోజుల సెలవు తీసుకుని చెక్కేస్తున్నానుఖి అని చెప్పింది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా తను దత్తత తీసుకున్న 31 మంది చిన్నారులతో కలసి దీపావళి సంబరాలు జరుపుకుంటుందట. ”టపాసులు కాల్చకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఒక్క పర్యావరణం కోసమనే కాదు. మాకు పెట్స్‌ బాగా వున్నాయి. ఈ టపాసులు కాలిస్తే ఆ శబ్దాలకు అవి భయపడిపోతాయి. మన ఆనందం కోసం వాటిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? దాని బదులుగా పిల్లలకి రకరకాల పోటీలు పెడతాం. బహుమతులు పంచుతాం. అలా సరదాగా గడిపేస్తాం అని చెప్పింది