అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ కు సహకారం

Gadkari
Gadkari

అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ కు సహకారం

విజయవాడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ నదుల అనుసంధానం విషయంలో తాను అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందిస్తానని చెప్పారు. అలాగే రహదారుల నిర్మాణం విషయంలో ఏపీపై ప్రత్యేక దృష్టిపెట్టామని గడ్కరీ చెప్పారు.

దేశంలో 80 శాతం రవాణా జాతీయ రహదారిపై జరుగుతోందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు.  రూ.7015 కోట్లతో 315 కిలోమీటర్ల జాతీయ జల రవాణా మార్గానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్రమంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. ప్రస్తుతం రోజూ 28 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మిస్తున్నామన్నారు. రైలు, రోడ్డు మార్గాల్లో రద్దీ నియంత్రణ, చౌకైన ప్రయాణానికి అవకాశం ఉందని, కాలుష్యం లేని ప్రయాణ సౌకర్యానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు.

రైలు, రోడ్డు మార్గాలలో రద్దీ నియంత్రణకు జల రవాణా ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ రోజు శంకుస్థాపన జరిగిన కార్యక్రమాలన్నీ త్వరలో పూర్తవుతాయని గడ్కరీ చెప్పారు. ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో జల రవాణాకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతున్నారు. 7015 కోట్ల రూపాయల వ్యయంతో 315 కిలోమీటర్ల జల రవాణా మార్గానికి ఈ రోజు శంకుస్థాపన జరిగిందన్నారు. చౌక అయిన రవాణాలు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి విజన్ కారణంగానే నేడీ కార్యక్రమం జరుగుతోందని, ఇది త్వరలో పూర్తి అవుతుందన్నారు. సాగరమాల కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభమౌతుందన్ని గడ్కరి అన్నారు