అన్ని వర్సిటీల్లో ఆన్‌లైన్‌ అడ్మిషన్లు: యుజిసి ఆదేశం

 

అన్ని వర్సిటీల్లో ఆన్‌లైన్‌ అడ్మిషన్లు: యుజిసి ఆదేశం
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విధానం ప్రవేశపెట్టాలని యునివర్సిటీస్‌ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిని) ఆదేశించింది. యుజిసి చైర్మన్‌ వేద్‌ప్రకాశ్‌ ఈ మేరకు అన్ని వర్సిటీల విసిలకు మంగళవారం లేఖరాశారు. వచ్చేనెల మొదటివారంలో జరిగే సమావేశంలో వర్సిటీలు ఆన్‌లైన్‌ అడ్మిషన్ల కోసం తీసుకున్న చర్యల పురోగతిని సమీక్షిస్తామని పేర్కొన్నారు ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విధానం కారణంగా ప్రతిభకు పట్టటమే కాకుండా ప్రవేశాల్లో పారదర్శకత కూడ ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.