అన్ని గామాల్లో మార్చి 11న కొత్త పాస్‌పుస్తకాలు

TS CM KCR
TS CM KCR

This slideshow requires JavaScript.

అన్ని గామాల్లో మార్చి 11న
కొత్త పాస్‌పుస్తకాలు

రైతు సంక్షేమానికే ప్రభుత్వం అంకితం
రాష్ట్రపతి లేదా ప్రధానిని ఆహ్వానిస్తాం
రెవెన్యూ శాఖ పరిధిలోనే ఇకపై
భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ!
పార్ట్‌ ఎ విజయవంతం..త్వరలో పార్ట్‌ బి
కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో ‘ధరణి
ఎమ్మార్వోలకు సబ్‌ రిజిస్ట్రార్‌ బాధ్యతలు!
అవినీతి, నకిలీలతో నెలకొన్న సమస్యలను తొలగించడమే లక్ష్యం!:
సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌ : మార్చి 11న రా ష్ట వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేరోజు కొత్త పాస్‌ పుస్తకాలను రైతులకు పంపిణి చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్‌రావు ప్రకటించారు. కొత్త పాసుపుస్తకాల పంపిణీ కార్య క్రమానికి దేశ రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రిని ఆహ్వానించ నున్నట్లు సిఎం వెల్లడించారు.

దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈకార్యక్రమం తర్వాత భూమి వివరాలు ప్రభుత్వం వద్ద అం దుబాటులో ఉన్నాయని ఈవివరాలతో కూడిన పాస్‌ పుస్త కాలు కొత్తగా ప్రింట్‌ చేస్తున్నట్లు సిఎం తెలిపారు. ఇవే వివరా లను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెడతామన్నారు. కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో ల్యాండ్‌ వెబ్‌సైట్‌ నిర్వహిస్తామని, దీనికి ‘ధరిణి అనే పేరుతో ఖరారు చేసినట్లు సిఎం వెల్లడించారు. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేని పారదర్శకమైన కొత్త రిజిస్ట్రేషన్‌ విధానాన్ని తీసుకొస్తున్నామని, పూర్తి స్థాయి సంస్కరణలతో వస్తున్న కొత్త రిజిస్ట్రేషన్‌ విధానాన్ని మార్చి 11 నుంచే అమలు చేస్తామని కేసిఆర్‌ ప్రకటించారు.

అదేరోజు ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. రెవెన్యూ శాఖ పరిధిలోనే ఇకపై భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందని కాబట్టి రెండు శాఖల మధ్య మరింత సమన్వయం సాధించడానికి ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న వాకాటి కరుణనే రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సిఎం ప్రకటించారు. కొత్త పాస్‌ పుస్తకాల జారీ, రిజిస్ట్రేషన్‌ విధానంలో సంస్కరణలపై ప్రగతిభవన్‌లో దాదాపు 8 గంటలపాటు శనివారం సుదీర్ఘ సమీక్ష జరిగింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సిఎం ముఖ్య కార్యదర్శులు ఎస్‌. నర్సింగ్‌రావు, శాంత కుమారి, కార్యదర్శి స్మితా సభర్వాల్‌, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, మీ సేవా కమిషనర్‌ జిటి వెంకటేశ్వరరావు, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ స్మార్ట్‌ గవర్నమెంట్‌ జిఎం డి. శ్రీధర్‌, సీనియర్‌ మేనేజర్‌ సుధీర్‌ గోలి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించిన సమగ్ర భూ ప్రక్షాళన ద్వారా వచ్చిన ఫలితాలను ఈ సమావేశంలో విశ్లేషించారు. అందులో ప్రధాన అంశాలు ఈవిధంగా ఉన్నాయి. 1,12,007 చదరపు కిలోమీటర్ల తెలంగాణ రాష్ట్రం మొత్త భూభాగం ఉంది. ఇందులో 2.80 కోట్ల ఎకరాలు ఉంది. దీనిలో 1.42 కోట్ల ఎకరాలు ఎలాంటి వివాదాలు లేని భూమి కాగా..17.89 లక్షల ఎకరాలు కోర్టు కేసులు, వివాదాలు, చిక్కులు కలిగిన భూములు ఉన్నాయి. 11.95 లక్షల ఎకరాలు రైతుల వద్ద ఉన్న వ్యవసాయేతర భూమి. 84.00 లక్షల ఎకరాలు చెరువులు, కుంటలు, కాలువలు, రైల్వేలైన్లు, సబ్‌స్టేషన్లు, విద్యాసంస్థలు, అసుపత్రులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల కింద భూమలు, కోర్ట కేసుల్లోని అటవీ భూములున్నాయి. 24 లక్షల ఎకరాలు నగరాలు, పట్టణాలు, గ్రామాల నివాస ప్రాంతాలు, వివాదాలు లేని అటవీ భూమి ఉంది. పార్ట్‌ ఏ విజయవంతం..

త్వరలో పార్ట్‌ బి… తెలంగాణ వ్యాప్తంగా 100 రోజుల పాటు నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన పాఈర్ట ఎ విజయవంతమైందని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 90శాతానికి పైగా భూమలు విషయంలో స్పష్టత వచ్చిం దని, ఏ భూమికి ఎవరు యజమానో తేలిందని సిఎం చెప్పారు. ఈ వివరాల ఆధారంగానే కొత్త పాస్‌ పుస్తకాల జారీ, పంట పెట్టుబడి మ్దదతు పథకం అమలు చేస్తామని ఆయన తెలిపారు. కోర్టు కేసులు, ఇతర వివాదాలు, అభ్యంతరాలు కలిగిన భూములను పార్టు బిలో పరిష్కరిస్తామన్నారు. పార్టీ బి చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం కొన్ని విధాన నిర్ణయాలు తీసకోవాల్సి ఉందని, త్వరలో కేబినెట్‌ సమావేశం నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని సిఎం వెల్లడించారు. అనంతరం పార్టీ బి ప్రక్షాళన కూడా నిర్వహిస్తామన్నారు. పార్టీ ఎ ద్వారా లెక్కతేలిన భూములకు సంబంధించిన వ్యవసాయ ఖాతాలు దాదాపు 71 లక్షలున్నాయని, వారందరికి కొత్త పాసు పుస్తకాలు ఇస్తామన్నారు.

రాష్ట్రంలోని ప్రతిఎకరం భూభాగం వివరాలు పొందుపరుస్తూ ఎప్పటికప్పుడు చోటు చేసుకునే మార్పులను కూడా నమోదు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డల వెబ్‌సైట్‌ ధరిణిని కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో నిర్వహించనున్నట్లు సిఎం వెల్లడించారు. దీనికోసం ప్రత్యేకంగా ఐటి విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్‌ వివరాలు, పేరు మార్పిడి వివరాలు అదేరోజు ఈ ధరిణితో నమోదు అవుతాయని, ఎమ్మార్వో కార్యాలయం నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్ల ఈవెబ్‌సైట్‌ నుంచి వివరాలు తీసుకోవచ్చన్నారు.

విదేశాల్లో ఉన్నవారు కూడా ధరిణిద్వారా అందే సమాచారంతో క్రయ విక్రయాలు జరుపుకోవచ్చని వెల్లడించారు. ఎమ్మార్వోలకు సబ్‌ రిజిస్ట్రార్‌ బాధ్యతలు రైతులు, ఇతర ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రతి ఎమ్మార్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకనే వెసులుబాటు కల్పించాలని సిఎం నిర్ణయిం చారు. రాష్ట్రంలో మొత్తం 584 మండలాలున్నాయని, ప్రస్తుతం 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయన్నారు. వాటిని యధావిధిగా కొనసాగిస్తారు. ఈ 141 సబ్‌ రిజిస్ట్రార్ల పరిధివారి కార్యాలయమున్న మండలానికి పరిమితమ వుతుంది.

మిగతా 443 చోట్ల ఎమ్మార్వోలకు సబ్‌ రిజిస్ట్రార్‌ బాధ్యతలు అప్పగిస్తారు, ఎమ్మార్వోలు తామిచిచన అపాయింట్మెంట్‌ తేదీలకు అనుగుణంగా శని, ఆదివారాలు, ఇతర సెలవులు మినహాయించి వారానికి ఐదు రోజులు ఉదయం పూట రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు నిర్వహిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమ్మార్వోలుహాజరుకాకపోతే ఆబాధ్యతలు డిప్యూటీ తహిసిల్దార్లకు అప్పగిస్తారు. అవినీతి, నకిలీలు ఇబ్బందిని తొలగించడమే లక్ష్యం! భూముల క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, భూ రికార్డుల నిర్వహణలో వందకు వందశాతం పారదర్శకత సాధించడం, అవినీతిని నిరోధించడం, నకిలీ పాస్‌పు స్తకాలున అరికట్టడం లాంటి లక్ష్యాలతో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ముఖ్యస్పష్టం చేశారు. రైతులు, ఇతర ప్రజలు తరుచూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తరిగే బాధ తప్పాలని, కేవలం ఒకేసారి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి రావాలన్నారు. పాస్‌ పుస్తకం వారి ఇంటికి కొరియర్‌ ద్వారా చేరాలన్నారు.

ఎవరి వద్దకు వెళ్లకుండానే తమపని ఒక్కరోజులో పూర్తి కావాలన్నారు. ప్రతిపాదిత రిజిస్ట్రేషన్‌ విధానం: అమ్మే వారు, కొనేవారు పరస్పర అంగీకారానికి వచ్చిన తర్వాత సబ్‌ రిజిస్ట్రార్‌కు అపాయింట్మెంట్‌ టైమ్‌ అడగాలి (పాస్‌ పోర్టులు, వాహన రిజిస్ట్రేషన్ల మాదిరిగా). భూమి అమ్మకానికి సంబంధించిన డాక్యుమెంటు తయారు చేయడానికి లైసెన్స్‌డ్‌ డాక్యుమెంటు రైటర్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఉంచుతారు. వారు ఫీజు తీసుకుని రాసిన కాగితాలను అనుమతిస్తారు. అమ్మేవారు/కోనేవార తామే స్వయంగా డాక్యుమెంటు రాసుకున్నా అనుమతిస్తారు. దీనికోసం వారికి సంబంధిత ఫారాలు అందుబాటులో ఉంచుతారు. అపాయింట్మెంట్‌ ఇచ్చిన తేదీ, సమయానికి అమ్మేవారు కొనేవారు ఇద్దరు తమ పాస్‌పుస్తకాలతో సబ్‌ రిజిస్ట్రార్‌ ముందు హాజరు కావాలి. బయోమెట్రిక్‌ విధానం ద్వారా ఇద్దరి వేలిముద్రలు, ఫోటోలు, సంతకాలు తీసుకుంటారు.

ఎంత భూమి అమ్ముతున్నారో అంత భూమిని అమ్మేవారి పాస్‌ పుస్తకం నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ తొలగిస్తారు. అదే సమయంలో కొన్ని వారి పాస్‌ పుస్తకంలో నమోదు చేస్తారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ముద్ర వేసి, సంతకం చేస్తారు. ఈ వివరాలను ఎమ్మోర్వో కార్యాలయంలోని భూమి రికార్డుల్లో నమోదు చేస్తారు. ఎమ్మోర్వో ఆఫీసులోని ఐటి అధికారికి ఈవివరాలు పంపాలి. ఐటి అధికారి ఆవివరాలను వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేస్తారు. వెబ్‌సైట్‌లో నమోదైన వివరాలు కొన్నవారికి, అమ్మినివారికి వెంటనే ఎస్‌ఎంఎస్‌ పోతుంది (బ్యాంకు లావాదేవీల మాదరిగా). పాస్‌ పుస్తకాలను ఇప్పటి మాదిరిగా ఆర్డీవోకు పంపాల్సిన అవసరం లేదు. పేరు మార్పిడి (మ్యుటేషన్‌) బాధ్యత అధికారం పూర్తిగా ఎమ్మార్వోదే.

ఈ పేరు మార్పిడి జరిగిన తర్వాత ఎమ్మార్వో కార్యాలయం ముద్రవేసి, ఎమ్మార్వో సంతకం చేస్తారు. ఆ పాస్‌ పుస్తకాలను అదేరోజు తిరిగి సబ్‌ రిజిస్ట్రార్‌కు పంపుతారు. ఎమ్మార్వో నుంచి తనకు అందిన పాస్‌ పుస్తకాలను సబ్‌ రిజిస్ట్రార్‌ కొరియర్‌ ద్వారా అమ్మినవారికి, కొన్నవారికి పంపుతారు. కొన్న వారికి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ పంపుతారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డిస్పాచ్‌ అయిన వెంటనే ఇద్దరికీ ఎస్‌ఎంఎస్‌ వెళ్తుంది. రైతులకిచ్చే పాస్‌ పుస్తకంలో ఖాతా నంబరుతో పాటు పాస్‌ పుస్తకం యూనిక్‌ కోడ్‌, గ్రామంకోడ్‌, మండలం కోడ్‌, యజమాని ఆధార్‌ నంబరు ఉంటాయి.