అన్నిపార్టీల మద్దతు కోరుతాం

Ap Cm Chandra babu

అన్నిపార్టీల మద్దతు కోరుతాం

అమరావతి,:  వైఎస్సార్సీ, జనసేన పార్టీలు బిజెపి కోవర్టులుగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. మంగళవారం ఉదయం ఎంపీలు, అసెంబ్లీ వ్యూహాకమిటీ సభ్యులతో చం ద్రబాబు ఉండవల్లిలోని తమ నివాసం నుంచి టెలీకాన్ప ´రెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీ, జన సేనపార్టీలపై సీఎం చంద్రబాబు తీవ్రస్ధాయిలో మండి పడ్డారు. బిజెపి వైఎస్సార్సీ, జనసేన పార్టీల ఆజెండా ఒక్కటే అని, సమస్యను పక్కదారి పట్టించడం, టిడిపిీపై బురదజల్లడమే వైఎస్సార్సీ, జనసేన పని అని సీఎం చం ద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీని బద్నాం చేయాలని చూస్తున్నాయని, దానివల్ల ఎవరికి లాభం, తాము అడిగేది చేయకుండా ఇలా బురదజల్లడం ఏమిటని ప్రజలే ప్రశ్ని స్తున్నారని పేర్కొన్నారు.

పవన్‌ కల్యాణ్‌ అవాస్తవాలు మాట్లా డుతున్నారని మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులకు పునరావసం ఇస్తామని కేంద్రం చెప్పినట్లు, రాష్ట్రమే చేస్తా మని ముందుకొచ్చినట్లు పవన్‌ చెప్పడం అబద్ధమని ముఖ్య మంత్రి అన్నారు. గతంలో జగన్‌ మాట్లాడిన అవాస్తవాలే పవన్‌ చెబుతున్నారని విమర్శించారు. అవిశ్వాసంపై అన్ని పార్టీల నేతలతో మాట్లాడి మద్దతు కోరతానని ఆంధ్రప్ర దేశ్‌కు సహకరించామని అడుగుతానని ముఖ్యమంత్రి చంద్ర బాబు తెలిపారు.

వైఎస్సార్సీ, జనసేన పార్టీలు తనమీద విమర్శలు చేస్తూ మోడీపై ఈగ వాలనీవ్వడంలేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఎవరేం చేస్తున్నారు.ఈ రోజు ఏం చెబుతున్నారనేది ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. సోమవారం పార్లమెంట్‌లో రెండుపార్టీలు ఏ విధంగా చర్చను అడ్డుకుందీ చూశామని పేర్కొంటూ ప్రతి రోజూ అప్రమత్తంగా ఉండాలని, సమయం సందర్భాన్ని బట్టి వ్యవహరించాలని ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. కుట్రలను ఎదుర్కోవడం తెలుగువారికి కొత్తమీకాదని, అందులో తెలుగువారు రాటుదేలిపోయారన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయమనే తాము అడుగుతున్నామని, ఇందులో తప్పేమిటని సూటిగా ప్రశ్నించారు. తాము యుద్ధం చేయ డంలేదని, ధర్మంకోసం పోరాడుతుంటే మీకు యుద్ధంలా కనిపిస్తోందా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. బి.తీ.రీళిIళీబీవితిలీగీళిగిY బి.తీ.రీళిIళీబీవితిలీగీళిగిY