అన్నదాత సుఖీభవ

R.Narayana Murthy

అన్నదాత సుఖీభవ

సాధారణంగా మనం ఎవరి ఇంటికైనా బోజనానికివెళ్లినప్పుడు, ఎవరైనా మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు, బోజనం పూర్తికాగానే అన్నదాత సుఖీభవ అని అంటుంటాం. అయితే అన్నం ఉత్పత్తి చేసేది రైతు. కాబట్టి అన్నదాత సుఖీభవ అంటే రైతన్న నువ్ఞ్వ సుఖంగా ఉండు అని అర్థం. రైతు బ్రతకాలి. అందరినీ బ్రతికించాలని కోరుకున్నదే ఈ సినిమా. మన దేశ ప్రధాని నరేంద్రమోదీగారు, తెలంగాణ సిఎం. కెసిఆర్‌గారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి నేను చేస్తున్నవిజ్ఞప్తిఎంటంటే రైతులకు గిట్టుబాబు ధర కల్పించాలి.

తెలంగాణ సిఎం కెసిఆర్‌గారు మిషన్‌ భగీరధ, మిషన్‌ కాకతీయ వంటిపనులతో బ్రహ్మాండంగా రైతుకు అండగా నిలబడుతున్నారు. ఇంత మేలు చేస్తున్నా సరే. రైతులెందుకు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకంటే కేవల గిట్టుబాటు ధలు రాకపోవడం వల్లేనే. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వెస్ట్‌ గోదావరి జిల్లా, తమిళనాడులో తంజావూరు జిల్లా కానీ ఈ ఏడాది వరి తెలంగాణ జిల్లాలో వరి బాగా పండింది. అలాగే చంద్రబాబు నాయుడు గోదావరి నీటిని కృష్ణాజిల్లా, గుంటూరు, నెల్లూరు, నెల్లూరు జిల్లా వరకు అందిస్తున్నారు. ఆయనెఆగైతే నీటిని అనుసంధానం చేసి ప్రజలకు అందిస్తున్నారో అలాగే పోలవరం నుంచి ఉత్తరాంధ్రను కూడా సస్యశ్యామలం చేయాలని కోరుకుంటున్నాను.

ఓ రైతుకు నెలకు 50వేలు రాబడి వచ్చేలా ప్రధాని, తెలుగు ముఖ్యమంత్రులు చర్యలు తీసుకోవాలి. ఇక నా సినిమా విషయానికి వస్తే, పాటలు రికార్డింగ్‌ అయిపోయాయి. గద్దరన్న, గోరేటివెంకన్న, సుద్దాల అశోక్‌ తే, వంగపండు ప్రసాద్‌ గారు పాటలు రాశారు. ఆగస్టు 4 సినిమా ప్రారంభమవ్ఞతుంది. రైతుకు పాలకులు, ప్రజలు అండగా నిలబడాలి అన్నారు.