అన్నదాతలపై కక్షా, శిక్షా!

indian farmer
indian farmer

అన్నదాతలపై కక్షా, శిక్షా!

తెలంగాణ, ఆంధ్ర తదితర రాష్ట్రాలకు చెందిన పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీలు, పవర్‌ గ్రిడ్‌కార్పొరేషన్‌ సంస్థలు బ్రిటిష్‌ కాలం నాటి 1885 చట్టాన్ని అడ్డం పెట్టుకుని రైతుల నుంచి భూమి హక్కులను,మానవ హక్కులను, నిస్సిగ్గుగా గుంజుకోవడం పరిపాటిగా వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈవిషయమై రాష్ట్రాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ నడుం కట్టుకుని రైతుల హక్కులు కాపాడటంలో శ్రద్ధ చూపడం లేదనే చెప్పవచ్చు. రైతుల అంగీకారంతో నిమిత్తం లేకుండా వారి పొలాల నుంచి హైటెన్షన్‌ వైర్లు వేయడమే కాదు,సంబంధిత భూమి యజ మానులకు నష్ట పరిహారమైనా చెల్లించడం లేదు. అనంతపురం జిల్లాలో హైటెన్షన్‌ వైర్లు రైతులు పట్టుకోవడం, నిర్లక్ష్యంగా సంబంధిత యంత్రాంగం ఆ వైర్లను మీదకు లాగి వేయ డం, రైతులిద్దరూ నేలపై జారిపడి తీవ్రంగా గాయపడడం సంచల నం కలిగించింది. ఇది ప్రత్యేకమయిన సంఘటన కాదు,

కరెంట్‌ కనెక్షన్‌ వైర్లు కొన్ని లక్షల కిలో మీటర్ల దూరంలో వేస్తుంటారు. ఇండియన్‌ టెలిగ్రాఫిక్‌ చట్టం 1885 ప్రకారం ఈ పనులన్నిటికీ ముందుగా ఎవరి అనుమతి,అంగీకారం తీసుకోవలసిన అవసరం ఉండదని రంగారెడ్డి జిల్లా యంత్రాంగం చెబుతున్నారు.సుప్రీంకోర్టు కూడా ఇండియన్‌ టెలిగ్రాఫిక్‌ చట్టం మేరకు చేపట్టిన ఏ ప్రాజెక్టు పనులకయినా ముందుగా రైతుల అంగీకారం తీసుకోవలసిన అవ సరం లేదని ఇటీవల తీర్పులో పేర్కొంది.ఎలక్ట్రిసిటీ యార్డు 2003 సెక్షన్లు 164,168 కూడా ఇవే అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎలక్ట్రిసిటి యాక్టు 2003,లో రూపొందించిన నిబంధనలు ఏం చెబుతున్నాయంటే నేరుగా కరెంట్‌ కనెక్షన్లు అనుసంధానం చేసే డైరెక్టు ట్రాన్సిమిషన్‌ కంపెనీలు నిబంధన3(1) (ఎ)ప్రకారం స్థల యజమాని అంగీకారం ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది.అయితే ఈ ప్రక్రియ కార్పొరేషన్ల ద్వారా జరగాలి. స్థలం యజమానికి ముందుగా నోటీసులు పంపించి అంగీకారాన్ని అభ్యర్ధించాలి. అలా గే నష్టపరిహారం ఎంత చెల్లిస్తారో దాని షరతులు ఏమిటో వివ రించాలి. స్థల యజమాని తిరస్కరిస్తే కార్పొరేషన్‌ వారు కలెక్టర్‌ను సంప్రదించవలసి ఉంటుంది. ఈవిషయంలో నిర్ణయం తీసుకోవల సింది కలెక్టరే,చాలా కంపెనీలు టెలిగ్రాఫిక్‌ చట్టాన్ని అడ్డం పెట్టుకుని తమను తాను రక్షించుకుంటాయి.

అయితే ఈ చట్టం టెలిగ్రాఫిక్‌ చిన్న స్థంభాలకు ఉద్దేశించినది. ఈ చిన్న స్థంభాల్లో ఎలక్ట్రోమేగ్నటిక్‌ రేడియేషన్‌ ఉండదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన రఘునాధ రెడ్డి పవర్‌ కేబుల్‌ కారిడర్‌ కింద తన స్థలాన్ని కోల్పోయారు. నష్టపరిహారం ఆశించినా ఫలితంలేక రైతుల అసోసిియేషన్‌ సహకా రాన్ని తీసు కుంటన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముత్కారు మండలంలోని మామిడిపూడి గ్రామానికి చెందిన రైతు నక్కా వీరా స్వామి రైతు సంఘానికి సహాయంగా ఉంటున్నారు. తన చిన్నాన్న నక్కా రెడ్డయ్య 75 సెంట్ల స్ధలాన్ని కోల్పోయాడని, మిగతా రైతులు కూడా తమ స్థలాలను నష్టపోయారని, పేర్కొన్నారు. అయితే ఎపిిజెన్‌లో మాత్రం తమకు నష్టపరిహారం పొందే అర్హత లేదని, తాము దళితులమని చెప్పిభూమిని ఆక్రమించామని ఆరోపిస్తున్నా రని వివరించాడు. రైతులు ఎవరైతే వ్యక్తిగతంగా జిల్లా అధికార యంత్రాం గాన్ని సంప్రదిస్తారో వారే నష్టపరిహారం పొందుతున్నా రన్న ఆరోపణ వినిపిస్తోంది. కన్సార్డియమ్‌ ఆఫ్‌ఫార్మర్స్‌ అసోసి యేషన్‌ సంస్థాపకులు పి.చెంగల్‌ రెడ్డి ఈ సమస్యపై మాట్లాడుతూ పవర్‌గ్రిడ్‌్‌ కార్పొరేషన్‌ వంటి చాలా ట్రాన్సిమిషన్‌ కంపెనీలకు కొన్నివేల కోట్ల రూపాయల ప్రయివేట్‌ పెట్టుబడులు ఉంటాయి.

ఆమేరకు కొన్ని వందల కోట్లు డివిడెండ్లు చెల్లిస్తుంటాయి. ఆయినా రైతులకు ఒక్కపైసా నష్టపరిహారం చెల్లించరు. ట్రాన్సిమిషన్‌ టవర్ల స్థాపనపై దేశం మొత్తం మీద రైతులు ఆందోళనలు సాగిస్తున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. చాలా కేసుల్లో పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఎటువంటి నష్టపరిహారం చెల్లించడం లేదు. ఈపవర్‌ గ్రిడ్‌ టవర్ల కోసం లక్షల ఎకరాలు వదులుకోవలసి వస్తోంది. రైతు పొలాలను టవర్ల కోసం వినియో గించుకోవడమే కాకుండా లైన్లు వేస్తున్న సమయంలో పంటలకు జరిగిన నష్టాన్ని కూడా పరిగణించి నష్టపరిహారం చెల్లించాలని చెంగల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ట్రాన్సిమిషన్‌ కంపెనీలు తప్పుడు సమాచారం అందివ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్భీతిగా స్థల యజమానులకు నష్ట పరిహారం చెల్లించకుండా ఎగవేస్తున్నా యని ఆయన విమర్శించారు.

1885టెలి గ్రాఫిక్‌ చట్టమే కాకుండా ఎలక్ట్రిసిటి యాక్టు1910 లో వచ్చింది. ఈ చట్టం ప్రకారం కరెంటు లైన్ల కింద శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. కొబ్బరి,టేకు,రబ్బరు, చెరకు వంటి తోటలు ఏవీ పెంచరాదు. వరి,వేరుశనగ,మాత్రమే సాగు చేసుకోవచ్చు. ఈలైన్ల కింద ఉన్న స్థలాలు 80 ఏళ్ల వరకు ఎలాంటి విలువ లేని భూములుగా మిగిలిపోతాయి.ఈ విధంగా భూమి విలువ కోల్పవడం ఆర్డికల్‌ 300(ఎ) కింద ఆస్తిహక్కును ఉల్లం ఘించడం కిందకు వస్తుంది.

-దొరయ్య