అన్నదమ్ముల్లా కన్పిస్తున్నారు.: నాగబాబు

DSC_0531_1600x1060
Dhruva Pre Release Function

అన్నదమ్ముల్లా కన్పిస్తున్నారు.: నాగబాబు

చిరంజీవికి, రామ్‌చరణ్‌కు పెద్దతేడా ఏదీ కన్పించటం లేదుని, ఖైదీనెం150లో చిరంజీవిని, ధృవలో రామ్‌చరణ్‌ను చూస్తుంటే వయసులో ఇద్దరికీ తేడా లేదని అన్పిస్తోందని ప్రముఖ నిర్మాత నాగబాబు అన్నారు. రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ధృవ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ మంత్రి కెటిఆర్‌, ఎంపి మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈసందర్భంగ నాగబాబు మాట్లాడుతూ, నిర్మాత అల్లు అరవింద్‌ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారని అన్నారు. చరణ్‌కు ఈచిత్రం పెద్ద హిట్‌ అవుతుందన్నారు. అన్నయ్య చిత్రం, ధృవ చిత్రం చూస్తుంటే వారిద్దరూ అన్నదమ్ముల్లా ఉన్నారని వ్యాఖ్యానించారు. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ, పోలీస్‌ అంటే నమ్మకం, అది లుక్‌ ద్వారా వస్తుందని ఆ లుక్‌ని చరణ్‌ తీసుకొచ్చార్నారు. దర్శకుడు వివి వినాయక్‌ మాట్లాడుతూ, డిసెంబర్‌లో తనయుడి సినిమా చూసి ఆనందించాలని, సంక్రాంతికి తండ్రి సినిమా చూసి ఆనందించాలన్నారు. ఈసినిమా కోసం చరణ్‌ ఎంతగానో కష్టపడ్డారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్‌, హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.