అనుమానాస్ప‌ద వ్య‌క్తుల సంచారంతో హై అల‌ర్ట్‌

HIGH ALERT IN PATHAN KOT
HIGH ALERT IN PATHAN KOT

జ‌మ్మూః పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ సమీపంలో ముగ్గురు అనుమానాస్పద ఉగ్రవాదులు ఆయుధాలతో సంచరిస్తుండటంతో జమ్మూకశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. పఠాన్‌కోట్‌లో చెక్‌‍పోస్టులు ఏర్పాటు చేసి సాయుధ అనుమానితుల కోసం గాలిస్తున్నారు. అనుమానాస్పద ఉగ్రవాదులు సంచరిస్తుండగా తాము చూసినట్టు స్థానికులు ఇప్పటికే ఇచ్చిన సమాచారం కూడా పరిగణనలోకి తీసుకుని తాజా చర్యలు చేపట్టారు. గత మూడు నాలుగు రోజుల నుంచి అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై తమకు సమాచారం అందుతోందని, అయితే దీనిని నిర్దారించే ఆధారాలు ఇంకా వెలుగులోకి రాలేదని బోర్డర్ జోస్ ఐడి పార్మర్ తెలిపారు.