అనుమానాస్పదంగా ఐదు మృతుదేహాలు

లక్నో: ఉత్తరప్రదేశ్, అలహాబాద్, ధుమాంగంజ్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు చనిపోవడంతో ఈవిషాదం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద పరిస్ధితిలో మృతదేహాలు పడివుండగా పలు సందేహాలు వస్తున్నాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇంటితాళం వేసి వుండటంతో పగుల గొట్టి పోలీసులు లోనికి ప్రవేశించగా వారికి అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలను గుర్తించారు. ఒక వ్యక్తి(భర్త) ముందుగదిలో ఉరికి వేలాడుతూ కనిపించగా, లోపల ఫ్రిజ్‌లో మహిళ(భార్య) మృతదేహం కనిపించింది. ఇద్దరు కుమార్తెల శవాలు సూట్‌కేస్‌లో, బీరువాలో కుక్కి వుండగా,మూడవ కుమార్తె శవం మరో గదిలో పడి ఉన్నట్ట పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. భార్య, ముగ్గురుకుమార్తెలను హత్యచేసి భర్తకూడా ఆత్మహత్య చేసుకొని వుండొవచ్చనే సందేహాన్ని అలహాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ నితన్ తివారీ వ్యక్తంచేశారు. దర్యాప్తు జరుగుతోందన్నారు.