అనుమానంతో హ‌త్య‌… ఆత్మ‌హ‌త్య‌

BREAKING NEWS
BREAKING NEWS

హైదరాబాద్: అనుమానం పెనుభూతమై పచ్చని సంసారంలో చిచ్చు రేపింది. బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ మాధవ్ తన భార్యకు మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆమెను హత్య చేసి ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిన్న జరిగింది. మాధవ్ నల్లకుంట సిండికేట్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. భార్యపై అనుమానమే పెనుభూతమై మాధవ్ ఈ విధమైన దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. మాధవ్‌కు వివాహం జరిగి 8 నెలలు అయింది. వైద్య పరీక్షలో ఆమె గర్భతి అని తెలిసింది. భర్తతో గొడవ రావడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లింది. ఇటీవలె అమె భర్తవద్దకు వచ్చింది. తమ అల్లుడు మారాడని భావించి అమ్మాయిని పంపించామని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.