అనుభ‌వం లేని ఆట‌గాడికి కెప్టెన్సీనాః గ్రేమ్ స్మిత్‌

Greame Smith
Greame Smith

జొహెన్న‌స్‌బ‌ర్గ్ః దక్షిణాఫ్రికా సారథి డూప్లెసిస్‌ గాయపడటంతో ఆ స్థానంలో భారత్‌తో వన్డే సిరీస్‌కి మార్‌క్రమ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఐతే ఈ నిర్ణయం సరైంది కాదని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్‌ స్మిత్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
తాజాగా స్మిత్‌ మాట్లాడుతూ..‘డూప్లెసిస్‌ స్థానంలో మార్‌క్రమ్‌కు జట్టు నాయకత్వ బాధ్యతలు అందించడం సరైన నిర్ణయం అని నేను అనుకోవట్లేదు. తక్కువ వయస్సులో, కేవలం 10 వన్డేలు కూడా ఆడని ఆటగాడికి ఎలా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారు. దీని వల్ల ఆటగాడు ఎంతో ఒత్తడికి గురవుతాడు. ఒత్తిడి కారణంగానే అతడు పరుగులు కూడా చేయలేకపోయాడు. భారత్‌ను ఎదుర్కొనేందుకు సఫారీ జట్టు వద్ద ప్లా్న్‌ బీ, సీలు లేవు. భాగస్వామ్యాలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమవుతోంది’ అని స్మిత్‌ తెలిపాడు.