అనుబంధాన్ని నిలిపే అభిరుచి

CONF
CONF


లైఫ్‌లో పరిష్కారమే లభించని సమస్య ఎదురయితే అదసలు సమస్యే కాదన్నాడో మహానుభావుడు. ఎందుకంటే తాళం ఉంటే అది తెరిచేందుకు తాళం చెవి కూడా తప్పకుండా ఉంటుంది. అలానే ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. ఎలాంటి సమస్య ఎదురైనా దానికి ఉన్న సొల్యూషన్స్‌ ఏమిటన్నది ఆలోచించాలి. కోరికలులేని పరమ సంతృప్తే జీవితానికి పరమానందాన్నిస్తుంది. అందుకే సంతృప్తి మనిషిని ప్రశాంతంగా ఉంచుతుంది.
ప్రతి మనిషికి తన మనసుకి నచ్చిన అభిరుచి ఒకటి ఉండాలి. దీని వలన మన అంతరంగంలో ఆనందం బాల్యం అలాగే ఉంటాయి. మొక్కల పెంపకం, రచనలు, ఆటలు, పాటలు ఇలా ఏదైనా అభిరుచి మనతో మనకున్న అనుబంధాన్ని నిలిపి ఉంచుతుంది. జీవిత పరమార్థం ఇప్పటిదాకా సాధించిన విజయాల కోసం పోరాటం వచ్చిన అపజయాలను మళ్లీ రాకుండా జాగ్రత్తపడడం అనేది ముఖ్యం. ప్రియమైన వారు ఎవరో తెలుసుకోవాలంటే ఎవరిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుందో వారు కాదు. ఎవరు దూరమయితే దుఃఖం కలుగుతుందో వారే మీకు ప్రియమైన ఆప్తులు. పదిమందికి ఉపయోగపడే స్థాయిలో ఎదగాలి. ఎవరినైనా ఎంత వరకు ఆదుకోగలిగితే అంతవరకు ఆదుకోవాలి. కొంత మంది వేలాది మందికి జీవనోపాధిని చూపించే విధానాలను తమ సంపాదనను వ్యయం చేస్తారు. ఆ వేలాది మంది జీవితాలలో వెలుగులు నింపి ఆ వెలుగుల వెలుతురులో బ్రతుకులు పండించుకుంటారు. వాయిదాలకు తావ్వికూడదు. రేపటి పని ఈ రోజు చేయాలి. ఈ రోజు పని ఇప్పుడే చేయాలనే నియమం పెట్టుకుని నిష్టగా పని చేసుకుపోతే వాయిదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లే. లైఫ్‌లో పరిష్కారమే లభించని సమస్య ఎదురయితే అదసలు సమస్యే కాదన్నాడో మహానుభావుడు. ఎందుకంటే తాళం ఉంటే అది తెరిచేందుకు తాళం చెవి కూడా తప్పకుండా ఉంటుంది. అలానే ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. ఎలాంటి సమస్య ఎదురైనా దానికి ఉన్న సొల్యూషన్స్‌ ఏమిటన్నది ఆలోచించాలి. కోరికలులేని పరమ సంతృప్తే జీవితానికి పరమానందాన్నిస్తుంది. అందుకే సంతృప్తి మనిషిని
ప్రశాంతంగా ఉంచుతుంది. సమయం వృథా అనుకున్న పనులు అప్పగించినపుడు నో చెప్పటం అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక పనితో బిజీగా ఉండటం, కాకుంటే చేసే ప్రతి పని కాలాన్ని సద్వినియోగం చేసేది అయి ఉండాలి. పనిలో ఉన్నప్పుడు ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోవాలి. ఫోన్‌, టివి స్నేహితుల నుండి కాల్స్‌ వంటివి లేకుండా చూసుకోవాలి. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా మలచుకోవాలి. ఆనందంగా గడపాలని తపన పడాలి. మనసు నిండా ఆనందపు ఆలోచనల నింపుకోవాలి. పెదవలుపై చిరునవ్వు చెదరనీయక, జీవితంలోంచి ఏ ఒక్క క్షణంలో కూడా ఆనందం తొలగిపోకుండా హాపీగా జీవించడం అలవరచుకోవాలి.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/