అనుపమ్‌కు పాక్‌ వీసా నిరాకరణ

 

anupam
న్యూఢిల్లీ: పాక్‌లో 5న జరగనున్న కరాచీ సాహిత్య ఉత్సవానికి బాలీవుడ్‌ నటుడ, బిజెపి ఎంపి అనుపమ్‌ఖేర్‌కు పాక్‌ వీసా నిరాకరించింది. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య తనకు తీవ్ర నిరాశ కల్గించిందని, కాశ్మీరీ పండిట్‌కావటం వల్లనే తనకు పాక్‌ వీసా నిరాకరించిందని ఆయన ఇక్కడ ఆరోపించారు. ఉత్సవంలోఎ పాల్గొనటానికి 18 మంది దరఖాస్తు పెట్టుకోగా కేవల తన ఒక్కడికి మాత్రమే వీసా నిరాకరించారని ఆయన పేర్కొన్నారు.