అనుకున్న వ్యూహాలు అమలు చేశాం: స్మిత్‌

SMITH
SMITH

అనుకున్న వ్యూహాలు అమలు చేశాం: స్మిత్‌

న్యూఢిల్లీ: టెస్టు మ్యాచ్‌ల్లో సొంతగడ్డపై టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియా విజయం సాధించి ఇప్పటికి 4502 రోజులైంది.ఈ విష యాన్ని ఆస్ట్రేలియా జట్టు సారథి స్టీవ్‌ స్మిత్‌ పేర్కొన్నాడు.పుణేలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో స్మిత్‌ మీడియాతో మాట్లాడుతూ సొంతగడ్డపై భారత్‌ను టెస్టుల్లో ఓడించి తమ జట్టు విజయం సాధించి సరిగ్గా 4502 రోజులైందన్నాడు.ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామని,తోటి ఆటగాళ్లంతా సత్తా చాటడంతోనే విజయం సాధించగలిగామని వివరించాడు.

టాస్‌ గెలవడం ఒక రకంగా తమకు కలిసి వచ్చిన విషయమని,దీంతో తాము అనుకున్న వ్యూహాలన్నీ అమలు చేయగలిగా మన్నారు. ఒకీపె అద్భుత ప్రదర్శన కనబరిచా రని స్మిత్‌ పేర్కొన్నాడు.2004-05 మధ్య ఆసియా జట్టు భారత్‌లో పర్యటించింది.నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 217 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం చెన్నైలో జరిగిన రెండవ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.తర్వాత నాగ్‌పూర్‌లో జరిగిన మూడవ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 342 పరుగుల తేడాతో విజయం సాధించింది.చివరి టెస్టులో భారత్‌ గెలువడంతో సిరీస్‌ 2-1 తేడాతో ఆస్ట్రేలియా దక్కించుకుంది.2004 తరువాత ఆస్ట్రేలియా భారత్‌లో పలుసార్లు పర్యటించింది. అయినప్పటికి ఒక్క మ్యాచ్‌లోను విజయం సాధించలేదు.తాజాగా పుణేలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా 333 పరుగులు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.