అనుకున్న ఫలితాలను సాధిస్తున్నాము

Chandrababu
Chandrababu

అమరావతి:  ఈరోజు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు    నీరుప్రగతి పురోగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్  నిర్వహించారు. నాలుగేళ్లలో రెండు తుపాన్లు..మరో రెండేళ్లు కరువు పరిస్థితులు ఏర్పాడ్డాయని, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా చూడాలని కోరానని తెలిపారు. అయితే కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోందని విమర్శించారు. అయినప్పటికీ పట్టుదలతో తమకున్న వనరులతో విపత్తులను అధిగమిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజల బాధలను తగ్గిస్తున్నామని..అనుకున్న ఫలితాలను సాధిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.