అనిశా వ‌ల‌లో ఆబ్కారీ క‌మీష‌న‌ర్‌

acb attacks in comissioner house
acb attacks in comissioner house

హైదరాబాద్‌ : అవినీతి నిరోధక శాఖ వలకు ఆబ్కారీశాఖ సహాయ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న అభియోగాలతో శ్రీనివాస్‌రెడ్డి ఇళ్లల్లో అనిశా అధికారులు సోదాలు చేపట్టారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి రామరాజుకాలనీలోని ఆయన నివాసంలో అనిశా డీఎస్పీ సునీత, రవికుమార్‌ ఆధ్వర్యంలో 10 మంది సభ్యుల బృందం తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో విలువైన ధ్రువపత్రాలు, నగదు, నగలు, బ్యాంక్‌ పాస్‌ బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌ పట్టణంలోని జ్యోతినగర్‌లోని ఆయన సోదరుడి ఇంటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 10 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.