అనంత‌పురం బ‌య‌లుదేరిన జ‌గ‌న్….

jagan
jagan

హైదరాబాద్: అక్ర‌మాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేత జగన్ శుక్రవారం సీబీఐ కోర్టుకు విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఈ కేసులో వాదనలు ముగిసిన అనంతరం న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఈ నెల 15కు వాయిదా వేశారు. కోర్టు వాయిదా అనంతరం జగన్ రోడ్డు మార్గంలో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గలోని బాపనపల్లికి బయలుదేరారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాద‌యాత్ర అనంత‌పురంలో జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అనంత‌పురం బ‌య‌లుదేరారు.