అనంతలో ఐటీ పార్క్‌: మంత్రి లోకేష్‌

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: అనంతపురంలో ఐటీ పార్‌క నిర్మించబోతున్నామని ఏపి మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. నేడు ఆయన యాష్‌ టెక్నాలజీస్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ యాష్‌ టెక్నాలజీ క్లౌడ్‌ సర్వీసెస్‌, డేటా ఎనలిటిక్స్‌ అండ్‌ సైన్స్‌ సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌, టెస్టింగ్‌ సర్వీసులను అందిస్తుందని చెప్పారు. ఏపిలో ఐటీ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై యాష్‌ టెక్నాలజీస్‌కు వివరించినట్లు లోకేష్‌ తెలిపారు. డిటిపి పాలసీ, ఇతరుల పాలసీలు, రాయితీల గురించి వివరించినట్లు తెలిపారు. కియా, అపోలో, హెసిఎల్‌ వంటి పెద్ద కంపెనీలు ఏపికి వచ్చాయని, ఏపిలో కార్యకలపాలు ప్రారంభించేందుకు యాష్‌ టెక్నాలజీస్‌ అంగీకారం తెలిపినట్లు మంత్రి లోకెష్‌ వెల్లడించారు.