అనంతపురం ట్రస్టుకు ఎస్‌బిఐ అంబులెన్స్‌ విరాళం

SBI
SBI

అనంతపురం ట్రస్టుకు ఎస్‌బిఐ అంబులెన్స్‌ విరాళం

హైదరాబాద్‌, డిసెంబరు 5: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బిఐ) కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సిఎస్‌ ఆర్‌) కింద తెలుగు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమా లు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం బ్యాంకు రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగం ఎండి పికెగుప్తా అనంత పురంరూరల్‌ డెవలప్‌మెంట్‌ట్రస్టుకు రూ.18.41లక్షల విలువై న అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చారు.

కనీస సదుపాయాలు కరవైన మారుమూల ప్రాంతాల్లో ని నిరుపేద రోగులను ఆసుపత్రులకు తరలించ డానికి ఈ అంబులెన్స్‌ ఆ ట్రస్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో అమ రావతి స్టేట్‌బ్యాంకు డివిజన్‌ ఉన్నతాధికారులు మణిపల్విసన్‌, రఘురామ్‌ శెట్టి, హైదరాబాద్‌ గన్‌ఫౌండ్రీలోని స్థానిక హెడ్‌ ఆఫీసుకు చెందిన ఆర్‌వి దేశ్‌పాండే తదితర అధికారులు పాల్గొన్నారు.
===