అనంతపురంలో మంత్రి సునీత పర్యటన…

Paritala Sunitha
Paritala Sunitha

అనంతపురం: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జలమయమైన పలు కాలనీల్లో సోమవారంమంత్రి పరిటాల  సునీత పర్యటించారు. రాప్తాడులోని మైనారీటీ, సీపీఐ కాలనీలకు మంత్రి పరిశీలించారు. అలాగే నడిమివంక, పండమేరు వాగు, సీఎన్‌పురం, సుందరయ్య కాలనీ, బీఎన్‌ఆర్‌ కాలనీ, జాకీర్‌ కొట్టాల, దండోరా కాలనీలలో పర్యటించారు. అనంతరం ఆమె  మాట్లాడుతూ జలమయైన లోతట్టు ప్రాంతాలను పరిశీలించి, నష్టాలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. 15 ఏళ్ల  తర్వాత జిల్లాలో వర్షపాతం నమోదైందని తెలిపారు. నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామని, వారికి బియ్యం, కిరోసిన్‌  అందజేస్తామని సునీత తెలిపారు.